ఇంటిదొంగల పనేనా

big boss 3 contestents

ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కడ చూసిన బిగ్ బాస్ ముచ్చట్లే వినవస్తున్నాయి. మొదటి సీజన్ కి ఉన్నంత క్రేజ్ సెకండ్ సీజన్ కి లేకపోయినప్పటికీ.. మసాలా మసాలా అంటూ స్టార్ మా ఎప్పటికప్పుడు బిగ్ బాస్ మీద క్రేజ్ పెంచేలా ఏదో ఒకటి చేస్తూ వస్తుంది. ఇక నాని కూడా మెల్లగా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ రచ్చ కూడా మాములుగా లేదు. షోలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో నానా రచ్చ చేస్తున్నారు పార్టిసిపెంట్స్. ఇక ప్రతి వారం ఎలిమినేషన్స్ లో, అనుకోని పార్టిసిపేట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. అసలు శ్యామల గాని భాను గాని షో నుండి ఎలిమినేట్ అవుతారంటే ఎవరు గెస్ కూడా చెయ్యలేదు. ఇక ఈ వారం కూడా ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒక గట్టి కంటెస్టెంట్ బయటికెళ్ళాసిన పరిస్థితి. మరి నామినేషన్స్ లో అందరూ గట్టి వాళ్లే ఉన్నారు. సామ్రాట్, తేజస్వి, రోల్ రైడ, తనీష్, దీప్తి, వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయినా గట్టివాళ్లే బయటికెళ్ళాలి.

అయితే బిగ్ బాస్ షో నుండి ఎలిమినేషన్ ప్రక్రియ శని ఆదివారాల్లో జరుగుతుంది. శనివారం ఎలిమినేషన్స్ లో ఉన్న వారిలో కొందరిని సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా నాని చెప్పడం… ఆదివారం ఫైనల్ గా నాని ఒకరిని బిగ్ హౌస్ నుండి బయటికి పంపడం జరుగుతుంది.అయితే నాని స్టార్ మా లో ఆదివారం ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నాడో అనే విషయం ఆదివారం పొద్దున్నకెల్లా పలు యూట్యూబ్ ఛానల్స్ లో అలాగే పలు వెబ్ సైట్స్ లో, అసలెందుకు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయ్. అయితే ఇలా లీకవడానికి కారణం బిగ్ బాస్ టీమ్ లో ఎవరో ఒకరేనంటా. అందుకే బిగ్ బాస్ హౌస్ లోని విషయాలను అలా లీక్ చేస్తున్నది బిగ్ బాస్ కి పనిచేసే వాళ్లలో ఎవరో ఉన్నారనే టాక్ వినబడుతుంది. అయితే వారిని పట్టుకోవడం అనేది స్టార్ మా కి కత్తి మీద సాము వంటిది. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ టీమ్ నుండి లీకైన న్యూస్ ఏమిటంటే… బిగ్ బాస్ హౌస్ లో తిట్లతో.. రూడ్ గా ఉంటూ ప్రతి కంటెస్టెంట్ తో దెబ్బలాటలు పెట్టుకునే తేజస్వి మడివాడ సేఫ్ జోన్ లో ఉండగా… ఎంతో బుద్దివంతుడిగా తన పని తాను చేసుకుంటూ.. అందరిని కలుపుకుపోతూ మంచి వాడిగా పేరు కొట్టేసిన సామ్రాట్ రెడ్డి ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నాడని అంటున్నారు. ఇక తనీష్, దీప్తి, రోల్ లు సేఫ్ అంటున్నారు.

మరి ఇలా మూడు రోజుల ముందే సామ్రాట్ ఎలిమినేట్ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. మరి స్టార్ మా యాజమాన్యం గాని.. యాంకర్ నాని గాని ఎలిమినేషన్స్ లో మా ప్రమేయం లేదు.. అంతా మీరిచ్చే ఓటింగ్ ని బట్టే అంటున్నారు. అందులోనూ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ అమలులో ఉందని అంటున్నారు. అలాంటప్పుడు ఇలాంటి లీకులు బయటికొస్తే.. స్టార్ మా మీద అనేక అనుమానాలు ప్రేక్షకుల్లో రేకెత్తుతాయి. ఇక సామాన్యులుగా షోలోకి అడుగుపెట్టిన నూతన నాయుడు కానివ్వండి, సంజన కానివ్వండి బిగ్ బాస్ షో నిర్వాహకులు తమకు పారితోషకం ఇవ్వలేదని.. బిగ్ బాస్ నిబంధనలు తుంగలో తొక్కి మరీ ఛానల్స్ లో రెచ్చిపోతున్నారు. మరి ఇదంతా బిగ్ బాస్ పై నెగెటివిటి ఏర్పడానికి అత్యంత ముఖ్యమైన కారణాలు. మరి వీటన్నిటి స్టార్ మా ఎలా ఆపుతుందో అనేది ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*