అమిత్ చెప్పిన టాప్ 3 లో వాళ్ళుంటారా?
బిగ్ బాస్ సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ముగింపు దగ్గరకు వచ్చిందో తెలియకుండా చాలా త్వరగా ముగింపు దగ్గరకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో ముగియనున్న సీజన్ 2 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో అని ఇప్పటినుండే చాలా హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. చివరికి వచ్చేపాటికి ఎవరికి వారే గట్టి పోటీని ఇస్తుండటంతో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో అని ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.
ఇక నిన్న అమిత్ ఎలిమినేట్ అవ్వడంతో పోటీ మరింత రసపాటుగా సాగనుంది. అమిత్ ఎలిమినేట్ అవ్వడంతో ఇంకా హౌస్ లో ఆరుగురు ఉంటారు. ఆరుగురిలో నెక్స్ట్ వీక్ ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. నెక్స్ట్ వీక్ మిగిలే ఆ ఐదుగురు ఫైనల్ కు చేరుకుంటారు. వీరిలో ఒక్కరు విజేతగా నిలవనున్నారు. ఈనేపధ్యంలో అమిత్ వెళ్తూ వెళ్తూ టాప్ 3 లో నిలిచే కంటెస్టెంట్లు ఎవరు? అని నాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చాడు.
ఇందులో నాకు ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా చెబుతున్న అని రోల్ రైడా.. సామ్రాట్.. గీతామాధురి పేరులు చెప్పాడు. ప్రస్తుతం అమిత్ ఇలా చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. మొదటినుండి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కౌశల్ పేరును అమిత్ చెప్పకపోవటం ఆసక్తికరంగా మారింది. మరి అమిత్ అంచనా ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే. మరోపక్క కౌశల్ కి బయట ఎక్కువ నెగటివిటీ వస్తున్నా నేపథ్యంలో విన్నర్ ఎవరు అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది.