మరి వాళ్లేందుకు రాలేదో..?

ఈ మధ్యన టాలీవుడ్ హీరోస్ అంతా ఎదో ఒక అకేషన్ లో కలుస్తూ ఒకే ఫ్రెమ్ లో కనబడుతూ అభిమానులను తెగ ఇంప్రెస్స్ చేస్తున్నారు. ఒకసారి రాజమౌళి తన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఓకే పిక్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం.. తర్వాతర్వాత మహేష్, ఎన్టీఆర్, చరణ్ లు కలిసి పార్టీలు ఎంజాయ్ చెయ్యడం.. తాజాగా హీరోల కోవలోకి డైరెక్టర్స్ కూడా వచ్చి చేరారు. నిన్నగాక మొన్న వంశీ పైడిపల్లి ఇంట్లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ మొత్తం కలిసి ఒక నైట్ అంటే… రాత్రి 7 నుండి తెల్లవారుజామున నాలుగింటి వరకు ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు పెట్టుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

ఆ డైరెక్టర్స్ లో రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి తదితరులు ఈ పార్టీలో పాల్గొని హడావిడి చెయ్యడమే కాదు.. రాజమౌళి వీళ్లందరినీ తన ఫోన్ లో సెల్ఫీలో బంధించాడు కూడా. అయితే ఇంతమంది డైరెక్టర్స్ కలిసినప్పుడు టాలీవుడ్ లోని మరికొంతమంది డైరెక్టర్స్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అంటే వారికి ఆ పార్టీకి ఆహ్వానం అందలేదో.. లేదంటే.. కావాలనే పార్టీకి అటెంట్ కాలేదో గాని ప్రస్తుతం ఆ పార్టీలో లేని డైరెక్టర్స్ గురించిన హాట్ టాపిక్ ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా జరుగుతుంది.

ఈ డైరెక్టర్స్ మీట్ లో లేనివారు హిట్ డైరెక్టర్ బోయపాటి, త్రివిక్రమ్, శ్రీను వైట్ల, వి.వి.వినాయక్, పూరి వంటి వాళ్ళున్నారు. మరి వీరికి ఆహ్వానం అందిందా.. లేదా కావాలనే డైరెక్టర్స్ మీట్ కి డుమ్మా కొట్టారా అనేది మాత్రం క్లారిటీ లేదు గాని… వాళ్ళు కూడా ఈ పార్టీలో కనబడితే బావుండేదంటున్నారు. మరి త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా అరవింద సామెత తోనూ, బోయపాటి రామ్ చరణ్ సినిమాతోనూ, శ్రీను వైట్ల రవితేజ అమర్ అక్బర్ ఆంటోని తో బిజీగా వున్నారు. కానీ మిగతావాళ్ళకి ఏమైందో వాళ్లకే తెలియాలి అంటున్నారు కొంతమంది. అయినా ఏ మేటర్ మీదైనా ఏదో ఒక కాంట్రవర్సీ లేకపోతె జనాలకు నిద్రేలా పడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*