మన సినిమా కలెక్షన్స్ పెరగడానికి కారణం వాళ్లే..

ఒక్కప్పుడు తెలుగు సినిమా 100 కోట్లు వసూలు చేయాడమంటే గగనం. కానీ మన టాలీవుడ్ సినిమాలు ఆ మార్క్ ని ఇప్పుడు అవలీలగా అందుకుంటున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తెలుగు ప్రేక్షకులని అలరించడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నాయి. 100 కోట్లు కాదు 200 కోట్లు కూడా వసూలు చేసాయి.

ఈ సినిమాలే నిదర్శనం…

అయితే దీని గురించి రామ్ చరణ్ ప్రస్తావిస్తూ మన తెలుగు మార్కెట్ క్రమంగా పెరుగుతుంది. ‘బాహుబలి’, ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. మన తెలుగు వాళ్లు గల్ఫ్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎక్కువగా సెటిలైనందున, మనం చేసే సినిమా వాళ్లు చూడటంతో కలెక్షన్స్ పెరగడానికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు.

విదేశీయులు కూడా…

అంతేకాకుండా ‘బాహుబలి’ సినిమాను భారతీయులే కాకుండా ఇతర దేశాల వాళ్లు కూడా ఆదరించిన విషయాన్ని గుర్తుచేశాడు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించాడు. మన ఇండియన్ సినిమాలని ఆదరించడమే కాకుండా మన ఆర్టిస్ట్స్ కి మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. ధనుష్‌కి హాలీవుడ్‌లో ఛాన్స్ రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు