ఎన్టీఆర్ గురించి తమన్ ఆసక్తికర ట్వీట్

నందమూరి హరికృష్ణ అకాల మరణంతో నందమూరి ఫామిలీ మొత్తం కన్నీరుమున్నీరు అయింది. ఆయన మరణంతో బాలకృష్ణ నుండి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వరకు అంతా తమ సినిమాల షూటింగ్ ఆపేసుకున్నారు. బాలకృష్ణ మూడు రోజులు తర్వాత నిన్న ఉదయం నుండి ‘ఎన్టీఆర్’ బయోపిక్ కు హాజరైయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న టైంలో హరికృష్ణ మరణ వార్తతో షూటింగ్ ఆపేసారు మేకర్స్.

షూటింగ్ కు హాజరు…

ఎన్టీఆర్ మానసికంగా కోలుకునే వరకూ ఈ సినిమా షూటింగ్ వాయిదా పడొచ్చని చెప్పుకున్నారు. దాదాపు 15 రోజులు బ్రేక్ తీసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దాంతో సినిమా దసరాకు కష్టమే అని చెప్పుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ నిన్నటి నుండి రెగ్యులర్ షూటింగ్ కి హాజరయ్యారు. తన కారణంగా షూటింగ్ ఆగిపోకూడదనీ, విడుదల వాయిదా పడకూడదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.

 

సోషల్ మీడియాలో పెట్టిన తమన్…

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్, తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అంకితభావానికి ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం.. ఆయన డెడికేషన్ చూశాక ఆయనపై మరింత గౌరవం పెరిగింది’ అంటూ సంగీత దర్శకుడు తమన్ ఒక ట్వీట్ చేశాడు. ‘మేమంతా నీతో ఉన్నాం.. మీకు మరింత బలం చేకూరాలి’ అంటూ తమన్ లొకేషన్ లోని ఎన్టీఆర్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో గురించి, తనకు సినిమాపై ఉన్న డెడికేషన్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*