ఎన్టీఆర్ పై తమన్ ట్వీట్ వైరల్..!

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ లో ఎన్టీఆర్ విరామం తీసుకోకుండా పాల్గొంటున్నాడు. కానీ అనుకోకుండా ఎన్టీఆర్ లైఫ్ లో ఒక దురదృష్టకర సంఘటన జరగడంతో.. కొద్దిరోజులు అరవింద సామెత షూటింగ్ కి ఎన్టీఆర్ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తండ్రి హరికృష్ణని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా దిగులు పడ్డాడు. అయితే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లు కూడా తండ్రి మరణాన్ని దిగమింగుకుని నిర్మాతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. తమ సినిమాల షూటింగ్ కి కొద్దిపాటి విరామంతో జాయిన్ అయ్యారు. అయితే షూటింగ్ సెట్స్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఎనర్జీ లెవల్స్ తో రెచ్చిపోయే ఎన్టీఆర్… ఇప్పుడు తండ్రి మరణంతో కాస్త డల్ అయ్యాడు.

ఎమోషనల్ గా షూటింగ్

అయితే తాజాగా అరవింద సమేత సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎన్టీఆర్ గురించి చేసిన ఒక ట్వీట్ ని చూసినా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. అరవింద సమేత సాంగ్ షూట్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ని చూసిన తమన్ ఈ విధంగా ట్వీట్ చేసాడు. ‘‘తారక్ అన్న ఈ రోజు చాలా ఎమోషనల్ గా సాంగ్ కోసం షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఆయన తన డ్యాన్స్‌ తో, మళ్లీ తన ఎనర్జీని వెనక్కి తెచ్చుకున్నట్టు అనిపించింది. నాకు చాలా మంచి ఫీల్ కలిగింది. నిజంగా మీకు చాలా పవర్ ఉంది తారక్ అన్నా.. అరవింద సమేత చిత్రబృందం తరుపున, మీకు లాట్స్ ఆఫ్ లవ్. అదేవిధంగా ఇక ఈ వారం నుండి అరవింద ఆడియో అప్‌డేట్స్ మొదలవుతాయి.. అంటూ ఎన్టీఆర్ పై తమన్ చేసిన ఈ ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*