టాలీవుడ్ హాఫ్ ఇయ‌ర్ హిట్లు ఇవే

ఈ ఏడాది ప్రథమార్ధంలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా… మరి కొన్ని సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే కొన్ని సినిమా యావరేజ్ హిట్స్ అయ్యాయి. ఇక చాలా సినిమాలు ప్లాప్స్ కూడా అయ్యాయి. ఇక ఆ ప్లాప్స్ లిస్ట్ ఇంతకూ ముందే చూసేసాం. ఇక ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ అండ్ సూపర్ హిట్స్ అండ్ యావరేజ్ హిట్స్ ఒకసారి చూసేద్దాం.

బ్లాక్ బస్టర్ హిట్స్:

1. రంగస్థలం: నాన్ బాహుబలి రికార్డులను నెలకొల్పి ఈ ఏడాది ప్రథమార్ధం లో రంగస్థలం సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. సుకుమార్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులకు నెలవుగా మారింది. పల్లెటూరి 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. అందుకే 80 కోట్ల ప్రీ రిలీజ్ గా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న రంగస్థలం సినిమా 120 కోట్లు పైనే రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

2. మహానటి: కీర్తి సురేష్ సావిత్రి పాత్రధారిగా తెరక్కేక్కిన మహానటి సినిమాని కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకుడిగా… కేవలం 20 నుండి 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా విడుదలైన మొదటి షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ అయ్యింది. మహానటిగా సావిత్రి పాత్రలో మెరిసిన కీర్తి సురేష్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా 25 కోట్ల పెట్టుబడుల‌తో తెరకెక్కితే.. రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టింది. సో ఆ విధంగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకెళ్ళిపోయింది.

సూపర్ హిట్స్:

1. భాగమతి: అనుష్క మెయిన్ లీడ్ లో తెరకెక్కిన భాగమతి చిత్రం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కినా… మంచి కలెక్షన్స్ రాబట్టింది. అనుష్క ప్రభుత్వ అధికారిగా… అనుకోకుండా జైలుకెళ్లడం తర్వాత భాగమతిగా మారి పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు రీచ్ కావడంతో… సినిమా మంచి హిట్ అయ్యింది. దర్శకుడు అశోక్ కి కూడా మంచి పేరొచ్చింది.

2.తొలిప్రేమ: వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా వెంకటి అట్లూరి దర్శకత్వంలో చిన్న సినిమాగా విడుదలై చితక్కొట్టే కలెక్షన్స్ తొలిప్రేమ రాబట్టి ఈ ఏడాది ప్రథమార్ధంలో మంచి హిట్ అందుకుంది.

3.ఛలో: నాగ సూర్య – రష్మిక జంటగా వెంకీ కుడుములు దర్శకత్వంలో నాగ శౌర్య ఓన్ బ్యానర్ లో తెరక్కేక్కిన ఛలో సినిమా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ అదరగొట్టే కలెక్షన్స్ తో పెట్టిన పెట్టుబడికి రెండింతలు తెచ్చింది.. సో అలా ఇది హిట్ లిస్ట్ లో పడిపోయింది.

యావరేజ్ హిట్స్:

1. భరత్ అనే నేను: మహేష్ బాబు – కొరటాల శివ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా భారీ హిట్ అన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఓ అన్నంతగా రాకపోవడంతో ఈ సినిమా యావరేజ్ హిట్స్ లో పడిపోయింది. మరి మహేష్ కి మాత్రం ఈ సినిమా హిట్ ఎంతో ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే అంతకుముందు రెండు సినిమా లు డిజాస్టర్స్ కావడంతో.. ఈ హిట్ మహేష్ కి ఊరటనిచ్చింది. ఇక ఈ సినిమాకి 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే… దీని క్లోజింగ్ కలెక్షన్స్ 92 కోట్లుగా ఉన్నాయి.

ఇక ఈ ఏడాది ప్రథమార్ధంలో హిట్ సినిమాల లిస్ట్ ఇది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*