పెళ్లికళ వచ్చేసిందే బాలా..!

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తున్న పెళ్లి మ్యాటర్స్ ఎవరి గురించి అంటే హీరోల్లో ప్రభాస్, నితిన్, హీరోయిన్స్ లో అనుష్క ల పెళ్లెప్పుడంటూ మీడియా తెగ తాపత్రయపడుతుంది. నిజంగానే 35 ఏళ్ళు దాటున్నప్పటికీ… హీరోయిన్స్ లా పెళ్లిళ్లు చేసుకోకుండా ఉన్న ఈ హీరోలకి ఆ పెళ్లి ముహుర్తం ఎప్పుడొస్తుందో గాని ఫాన్స్ మాత్రం తెగ ఇదై పోతున్నారు. ఇక హీరోయిన్స్ ఎలాగూ కెరీర్ కెరీర్ అంటూ అప్పుడే పెళ్లిళ్ల వైపు మొగ్గు చూపరు. ఎక్కడో నూటికో కోటికో సమంత, కరీనా కపూర్, సోనమ్ కపూర్ లాంటి వాళ్ళు ఉంటారు. ఇకపోతే నిర్మాత దిల్ రాజు కూడా తన నిర్మాణంలో తెరకెక్కిన పెళ్ళికి ముహూర్తం ఈ శ్రావణ మాసానికి దగ్గరగా పెట్టాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నితిన్ – రాశి ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం ముచ్చట్లు ముదిరిపోయాయి.

అచ్చం పెళ్లిని తలపించేలా..

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ఇక సినిమా ఆడియో వేడుక చూస్తుంటే ఒక సంపన్న కుటుంబం చేసే పెళ్లి గుర్తుకు వస్తుంది. ఆ రేంజ్ లో దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం ఆడియో వేడుకని అలంకరించాడు. ఈ ఆడియో వేడుకని చూస్తుంటే అచ్చం పెళ్లి పందిరి మాదిరిగా డెకరేట్ చేసిన శ్రీనివాస కళ్యాణం టీమ్ ఈ ఆడియో వేడుకకి విచ్చేసిన అతిధులకు సారె కూడా ఇచ్చారు. పెళ్లిళ్లలో సారెకు ఎంత ఇంపార్టెన్స్ ఉందొ అందరికి తెలుసు. అలాగే ఈ పెళ్లి ఆడియో కి వచ్చిన వారు కూడా ఒక స్వీట్, హాటు, బ్లౌజ్ పీస్ అలా అన్నిటితో కలిపి ఒక సారె గిఫ్ట్ పాకెట్ పట్టుకెళ్లారు. ఇక ఈ ఆడియో వేడుకకి నితిన్ పట్టు పంచె కట్టుకుని కల్యాణ తిలకం దిద్దుకుని.. అచ్చం పెళ్లికొడుకులా ముచ్చటగా కనబడ్డాడు.

టాలీవుడ్ కి పెళ్లి కళ వచ్చిందనేలా…

ఇక హీరోయిన్ రాశి ఖన్నా అయితే పెళ్లి పట్టుచీరలో పెళ్లి బొట్టుతో అచ్చం పెళ్లి కూతురు గెటప్ లో అదరగొట్టింది. మరి సినిమాలోనే కాదు సినిమా ప్రమోషన్స్ లోను శ్రీనివాస కళ్యాణం జనాల్లో అమితమైన ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. మరి ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ కి పెళ్లి కళ వచ్చేసిందే బాలా అనిపిస్తుంది కదూ. ఇకపోతే శ్రీనివాస కళ్యాణం కుటుంబ సమేతంగా చూడాలంటె ఆగష్టు 9 వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఎందుకంటే ఆగష్టు 9 నే శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*