చైతు కోసం టాప్ రైటర్..!

top writer story for naga chaitanya film

టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి మంచి పేరుంది. ఇక బాహుబలి రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ పేరు మాములుగా మార్మోగలేదు. మరి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథతో సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే.. ఆ సినిమాలకు ఆటోమాటిక్ గా హైప్ వచ్చేస్తుంది. అందుకేనేమో నాగార్జున తన పెద్ద కొడుకు కోసం ఇప్పుడు ఈ స్టార్ రైటర్ ని నమ్మకుంటున్నాడు. నాగ చైతన్య గత కొన్నాళ్లుగా హిట్ అనే పదానికి మొహం వాచిపోయాడు. వరస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న చైతు ప్రస్తుతం భార్య సమంత స్టార్ స్టేటస్ మీద ఆధారపడ్డాడు.

సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని…

శివ నిర్వాణ దర్శకత్వంలో భార్య సమంతతో కలిసి మజిలీ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మీద చైతు భారీ ఆశలే పెట్టుకున్నాడు. తనకి మార్కెట్ లేకపోయినా… సమంత స్టార్ డమ్ మీద సినిమాకి క్రేజ్ వస్తుందని.. అలాగే సినిమా కూడా హిట్ అవ్వాలనే కసితో పనిచేస్తున్నాడు. అయితే తాజాగా నాగ్… చైతు కోసం రైటర్ విజయేంద్ర ప్రసాద్ ని రంగంలోకి దింపుతున్నాడట. ఈ సినిమాతో చైతు సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కథని ప్రిపేర్ చేస్తున్నాడట విజయేంద్ర ప్రసాద్. ఇకపోతే ఈ కథతో చైతుని ఎవరు డైరెక్ట్ చేస్తారు..? ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*