ఇంతదానికే అంత సంతోషమా..?

trisha role in peta

సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. ఆయన పక్కన నటించాలంటే పెట్టి పుట్టాలనట్టుగా ఉంటుంది హీరోయిన్స్ వ్యవహారం. రజనీకాంత్ పక్కన ఛాన్స్ వచ్చింది అంటే ఆ హీరోయిన్ కి పండగే. అయితే కొన్నాళ్లుగా రజనీకాంత్ పక్కన వయసున్న హీరోయిన్స్ నటిస్తున్నారు. కాలా, కబాలీలో కాస్త వయసు మీరిన హీరోయిన్స్ రజనీ పక్కన నటించారు. తాజాగా పేటలో మొదటిసారి రజనీకాంత్ పక్కన సిమ్రాన్, త్రిష ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక పేటలో రజనీ సరసన ఛాన్స్ వచ్చినందుకు గాను త్రిష తెగ ఆనందపడిపోయింది. తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక రజనీకాంత్ – త్రిషల పేట పోస్టర్స్ ఆకట్టుకునేలా ఉండడం.. పేట ట్రైలర్ లో త్రిష ట్రెడిషనల్ లుక్ చూసిన వారు పేటలో త్రిష రోల్ మీద అంచనాలు పెంచుకున్నారు.

ఇద్దరి పరిస్థితీ అదే…

కానీ సినిమాలో చూసేసరికి త్రిష క్యారెక్టర్ కి అస్సలు ప్రాధాన్యత లేదు. రజనీకాంత్ భార్యగా త్రిష ట్రెడిషనల్ గా ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ లో చాలా చిన్న సీన్ లో కనబడినట్లుగానే పేట సినిమాలో త్రిష క్యారెక్టర్ ని కార్తీక్ సుబ్బరాజు డిజైన్ చేసాడు. అసలు ఫస్ట్ హాఫ్ లో త్రిష కనబడదు. అయితే ఫస్ట్ హాఫ్ లో లేని త్రిష సెకండ్ హాఫ్ లో బలంగా కనిపిస్తుందేమోలే అనుకున్న ప్రేక్షకుడికి నిరాశే కలుగుతుంది. మరో హీరోయిన్ సిమ్ర‌న్‌ కి, రజనీకి లవ్ ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది.. కానీ సిమ్రాన్ క్యారెక్టర్ ని కూడా దర్శకుడు సరిగ్గా తీర్చి దిద్దలేకపోయాడు. అసలు సిమ్రాన్, త్రిష‌.. ఇద్ద‌రి ట్రాకులూ వేస్టే. అస‌లు వీరిద్ద‌రినీ దర్శకుడు ఎందుకు తీసుకున్నాడో అర్థం కాదు. ఏదో హీరోయిన్స్ ఉంటేనే ప్రేక్షకుడు మెచ్చుతాడు అన్నట్టుగా ఉంది.. పేటలో హీరోయిన్స్ పరిస్థితి. ఇక త్రిష‌ ఒక‌టో రెండో డైలాగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఇంత దానికి త్రిష ఎందుకు అంట ఇదైపోయిందో ఆమెకే తెలియాలి. ఏదో రజనీ సినిమాలో కాసేపు కనబడినా చాలు అన్నట్టు ఉంది త్రిష క్యారెక్టర్ పేటలో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*