త్రివిక్రమ్ టెన్షన్ కి కారణమేంటీ..?

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ పది రోజుల కిందటే యూట్యూబ్ లో రిలీజ్ అయింది అయితే ఇప్పటివరకు ఈ టీజర్ పది మిలియన్ల వ్యూస్ దాటలేకపోయింది. అయితే టీజర్ చూసిన అందరు ఇది త్రివిక్రమ్ మార్క్ లా లేదని వినాయక్, బోయపాటి మార్క్ లా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

మరో టీజర్ విడుదల చేస్తారా..?

దీంతో త్రివిక్రమ్ తన మార్క్ కనపడేలా మరో టీజర్ ను రిలీజ్ చేస్తాడని గత కొన్ని రోజులు నుండి మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వార్తల్ని టీం పూర్తిగా ఖండించింది. అలాంటిది ఏమి లేదని నేరుగా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని టీం స్పష్టం చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆశలపై నీరు పోసినట్టయింది. త్రివిక్రమ్ తీసిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ప్రేక్షకులు తనదైన ట్రేడ్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ ను ఆశిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో త్రివిక్రమ్ కు పెద్ద సవాలైంది.

మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తి…

ఇక ఈ సినిమా అక్టోబర్ 11 న విడుదల అవుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత వారం అంటే 18న విశాల్ పందెం కోడి 2తో, రామ్ హలో గురు ప్రేమ కోసమే వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ సినిమా పది రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ ఫార్మాలిటీస్, ఆడియో ఫంక్షన్ లాంటివి చేయనుంది. మరి త్రివిక్రమ్ ఈసారి అందరి నోర్లు ఎలా మూయిస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*