ఈ ఛైర్ గోల ఏంటి త్రివిక్రమ్..!

మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఈ ఏడాది రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో చాలా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా అతను ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలు కంపేర్ చేస్తూ కామెడీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్ ఒక్కసారి చూస్తే మీకే అర్ధం అవుతుంది.

మళ్లీ అలాంటి స్టిల్…

‘అజ్ఞాతవాసి’లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వుడెన్ చైర్ ను యాక్షన్ సీక్వెన్స్ లో ఎంత స్టైలిష్ తిప్పాడో మనకి తెలిసిన విషయమే. ఆ పిక్ ఫస్ట్ లుక్ లాంచ్ కన్నా ముందే వచ్చింది. నిన్న రిలీజ్ అయిన ‘అరవింద సమేత’ టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్ లో ఎన్టీఆర్ అటువంటి వుడెన్ చైర్ లోనే కూర్చున్నాడు. అతని కింద ఎవరో పడి ఉన్నట్టు తెలుస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఇది యాక్షన్ సీన్ లో స్టిల్ లాగా కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో జోకులు

ఆ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెల 15న విడుదల అయ్యే టీజర్ లో చూడాల్సిందే. సోషల్ మీడియాలో ఈ రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి త్రివిక్రమ్ పై జోకులు వేస్తున్నారు. అతనికి ఈ చైర్ సెంటిమెంటో? ఫ్లాప్ సినిమాలో వాడిన చైర్ ను మళ్లీ ఎందుకు వాడుతున్నవు బాబు.. అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. చూద్దాం మరి త్రివిక్రమ్ ఈ సినిమాతో ఏ మాయ చేస్తాడో.. కానీ త్రివిక్రమ్ ఎట్టి పరిస్థితిల్లో ఈ సినిమా హిట్ అవ్వాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*