ఈసారి గట్టిగా కొట్టెయ్యాలని ఫిక్స్ అయ్యాడు!

టెంపర్ తర్వాత మళ్లీ సిక్స్ ప్యాక్ తో అరవింద సమేత వీర రాఘవ అంటున్నాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ తో సినిమా కోసం పరితపించిన ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ కూడా ఒక మంచి హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఒకవేళ త్రివిక్రమ్ కి ఈ సినిమా కూడా హిట్ పడకపోతే స్టార్ హీరోలంతా మొహం చాటేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి ఫలితం తోనే మహేష్ బాబు ఇప్పటికే త్రివిక్రమ్ కి హ్యాండిచ్చాడనే టాక్ ఉంది. ఇక ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా ఏమైనా తేడా వస్తే ఇక త్రివిక్రమ్ కి చుక్కలే. అందుకే ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా మీద త్రివిక్రమ్ ఆశలు పెట్టుకోవడమే కాదు, తన మార్క్ డైలాగ్స్ తో కుమ్మెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు

కీలక పాత్రలో మెగా బ్రదర్…

అయితే ఫస్ట్ లుక్ లో మాస్ లుక్ తో పరిచయమైన ఎన్టీఆర్ ని చూస్తుంటే సినిమాలో యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉంటుందని అర్ధమవుతుంది. ఆది, సింహాద్రి లాంటి హై వోల్టేజ్ ఉన్న సినిమాల్లానే అరవింద సమేత ని ఎన్టీఆర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. హీరోయిన్ పూజ హెగ్డేను సాధారణంగా చూపిస్తూ హీరో ని మాత్రం పవర్ ఫుల్ యాక్షన్ లో చూపించబోతున్నారని టాక్. ఇక సీనియర్ నటుడు నాగబాబు ఎన్టీఆర్ కి నాన్నగా ఫస్ట్ పది నిమిషాలు కనిపించే ఒక కీలక పాత్ర చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని సినిమాలోని యాక్షన్ పార్ట్ నుండి వాడారని చెబుతున్నారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇంటెర్వెల్ బ్యాంగ్ కి ముందుంటుందనేది లేటెస్ట్ టాక్.

భారీ ధర పలికిన ఓవర్సీస్ హక్కులు…

ఎన్టీఆర్ తో పాటుగా విలన్ మీద 42 డిగ్రీల వేడి వాతావరణంలో షూట్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అంటున్నారు. ఇక పూజా హెగ్డే పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ హాఫ్ అంతా అందమైన ప్రేమకథతో నడిపించిన త్రివిక్రమ్ సెకండ్ హాఫ్ లోనే యాక్షన్ అంటూ ఫైటింగ్ ని టచ్ చేసాడని చెబుతున్నారు. మరి అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ ఛాయలు ఈ సినిమాపై పడే అవకాశం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ అలాగే యంగ్ టైగర్ కున్న క్రేజ్ ముందు అరవింద సమేత మాంచి బిజినెస్ చేస్తుందని, ఇప్పటికే ఓవర్సీస్ హక్కులు రికార్డు ప్రైజ్ కి అమ్ముడయ్యాయనే టాక్ ఉండనే ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*