త్రివిక్రమ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడంట..!

‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘రంగస్థలం’… వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు రామ్ చరణ్ తో ఇంకో సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేయటం కోసం మైత్రీ మూవీ వారు అగ్రిమెంట్ చేయించుకున్నారట.

అడ్వాన్స్ తీసుకున్నా…

ఇందుకుగాను త్రివిక్రమ్ కి కూడా అడ్వాన్స్ ఇచ్చారంట. అయితే త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడంట. ఎందుకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సొచ్చిందంటే… ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయాలి కానీ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న బోయపాటి సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయడానికి డేట్స్ కూడా ఇచ్చేశాడంట.

చరణ్ ఖాళీగా లేకపోవడం వల్లే

అంటే ఈ ఏడాది చివరి నుండి వచ్చే ఏడాది చివరి వరకు ఖాళీగా ఉండడు చరణ్. దీంతో అప్పుటి దాకా ఖాళీగా ఎందుకు ఉండటం అని వెంకటేష్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. అదే కాకుండా రాంచరణ్ తో సినిమా మైత్రీ మూవీ మేకర్స్ కోసం కాకుండా తను సొంత బ్యానర్ లా భావించే హారిక హాసిని బ్యానర్ లో చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. అందుకే వారికి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడట. వెంకటేష్ తర్వాత చరణ్ తో సినిమా చేయాలని ప్లాన్ లో ఉన్నాడట త్రివిక్రమ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1