త్రివిక్రమ్ నెక్స్ట్ కన్ఫ్యూషన్ కి క్లారిటీ వచ్చిందా…

అజ్ఞాతవాసి సినిమా తర్వాత త్రివిక్రమ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందనే టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పటికీ… త్రివిక్రమ్ నెక్స్ట్ హీరోపై ఎడతెగని ఉత్కంఠ నడుస్తూనే ఉంది. ఇప్పటికే మహేష్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చేసి సుకుమర్ తోనూ, సందీప్ వంగా తోనూ కమిట్ అయ్యాడు. ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ హీరో బన్నీ అంటూ చాలానే వార్తలొచ్చాయి. కానీ బన్నీ నెక్స్ట్ డైరెక్టర్ మీద ఎంతగా ఉత్కంఠ నెలకొందో… ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ హీరో మీద కూడా అంతే ఉత్కంఠ నెలకొంది. అయితే త్రివిక్రమ్ అరవింద సినిమా తర్వాత వెంకటేష్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్ వారు ఒక సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు.

అయితే ఈలోపు వెంకటేష్ ని పక్కన పెట్టి త్రివిక్రమ్ మహేష్ కి బన్నీకి గాలం వేస్తున్నాడు.. మహేష్ అజ్ఞాతవాసి దెబ్బకి త్రివిక్రమ్ ని సైడ్ చేసాడని.. బన్నీ కూడా త్రివిక్రమ్ విషయం లో ఊగుతున్నాడనే టాక్ నడుస్తుండగా.. వెంకటేష్ వరసగా మల్టీస్టారర్ సినిమాలు చేసుకుపోతున్నాడు. త్రివిక్రమ్ సినిమా విషయంలో వెంకీ ఎటువంటి మాట మాట్లాడకపోయేసరికి త్రివిక్రమ్ బయట హీరోల కోసం వెంపర్లాడుతున్నాడనే ప్రచారం మొదలైంది. ఇక హారిక హాసిని బ్యానర్ లో వెంకటేష్ తో త్రివిక్రమ్ జాలి ఎల్ ఎల్ బి సినిమా రీమేక్ చెయ్యాల్సి ఉండగా.. త్రివిక్రమ్ రీమేక్ లకి వ్యతిరేఖం కనక.. వెంకటేష్ తో మరో దర్శకుడు హారిక హాసిని బ్యానర్ లో జాలి ఎల్ ఎల్ బి సినిమా చేస్తాడనుకున్నారు.

కానీ వెంకటేష్ జాలి.ఎల్. ఎల్. బి ని పక్కన పడేసి త్రివిక్రమ్ తో సినిమా చేసే ఉద్దేశ్యంతోనే ఉన్నాడట. అందుకే అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ ఖచ్చితంగా వెంకటేష్ తోనే సినిమా ఉంటుందట. ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్నఅరవింద సమేత దసర కల్లా విడుదల చేసేసి ఒక నెల గ్యాప్ తీసుకుని వెంకటేష్ తో త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం చేస్తాడనే సమాచారం అందుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*