ఆ ఐదుగురిలో ఎవరు ఛాన్స్ ఇస్తారో చూద్దాం..!

Sreenu Vaitla plan on remunaration failed

ఆగడు తో మొదలుపెట్టి… బ్రుస్ లీతో ఓవర్ చేసి.. మిస్టర్ తో మితిమీరిన శ్రీను వైట్ల తాజాగా అమర్ అక్బర్ ఆంటోనీతో అతి చేసాడు. మహేష్ బాబు క్రేజ్ ని ఆగడుతో మడతపెట్టేసాడు. రామ్ చరణ్ హీరోయిజాన్ని బ్రుస్ లీ తో కప్పెట్టేసాడు. మిస్టర్ తో వరుణ్ తేజ్ ని పడేసాడు. మరి అమర్ అక్బర్ ఆంటోని తో రవితేజని మరింతగా దిగజార్చేసాడు. ఆగడు ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ అవకాశం ఇవ్వడమే ఎక్కువైతే… బ్రుస్ లీ డిజాస్టర్ తర్వాత మళ్లీ మెగా ఫ్యామిలీ వరుణ్ ని శ్రీను వైట్లకి అప్పగించడం అనేది వారు చేజేతులా చేసుకున్న తప్పిదం. మరి మూడు డిజాస్టర్స్ తర్వాత మళ్లీ శ్రీను వైట్లకి రవితేజ అవకాశం ఇవ్వడమే గొప్ప. అలాంటిది ఒక పెద్ద నిర్మాణ సంస్థ శ్రీను వైట్లని నమ్మి కోట్లు పెట్టుబడి పెట్టడం ఇంకా వెరితనమే.

నిర్మాతలు పోటీ పడ్డారట…

ఒకసారి గ్రాఫ్ పడ్డాక మళ్లీ ఆ దర్శకుడు పైకి లెవడానికి ఎదో ఒక కొత్త కథ, ఎవరు ఊహించని కథనంతో రావాలి. కానీ శ్రీను వైట్ల చేసిన తప్పే చేస్తూ పోతున్నాడు. అందులోనూ గొప్పలు పోతున్నాడు. అవకాశాలు లేని శ్రీను వైట్లని రవితేజ అవకాశం ఇస్తే… మైత్రి వారు శ్రీను టాలెంట్ ని నమ్మి డబ్బు పెట్టారు. మరి శ్రీను వైట్ల ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సినిమాని తగిన బడ్జెట్ లో చేసి హీరోకి నిర్మాణ సంస్థకి హిట్ ఇవ్వాలి. కానీ తన డైరెక్షన్ లో సినిమా చేసేందుకు ఐదుగురు పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు.. కానీ మైత్రి వారైతే డబ్బు బాగా ఖర్చు పెడతారు కాబట్టి మైత్రి మూవీస్ ని నేను సెలెక్ట్ చేసుకున్నానని డబ్బాలు కొట్టాడు శ్రీను వైట్ల.

నిర్మాతతో ఎక్కువ ఖర్చు పెట్టించి…

అసలు తాను తీసిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోగా.. అవసరానికి మించి నిర్మాతలతో ఖర్చు పెట్టించాడనేది ప్రతి ఫ్రెమ్ లోను తెలుస్తుంది. అమర్ అక్బర్ ఆంటోని విడుదలైన మొదటి షోకే డిజాస్టర్ టాక్ పడింది. రవితేజకి వరసగా మూడో ఫ్లాప్ అయితే.. శ్రీను వైట్ల కి వరసగా నాలుగో డిజాస్టర్. మరి అస్సలు మర్కెట్ లేని హీరో రవితేజతో… తనకే అంతంత మాత్రం ఉన్న క్రేజ్ తో అల్లాటప్పా కథతో సినిమా చేసి తన గ్రాఫ్ మరింతగా పడిపోయేలా చేసుకున్నాడు. మరి ఐదుగురు నిర్మాతలు తన సినిమా కోసం పోటీ పడ్డారని గొప్పలు పోయిన వైట్ల కి అమర్ అక్బర్ ఆంటోని ఫ్లాప్ తో ఆ ఐదుగురిలో ఎవరో ఒకరు అవకాశం ఇస్తారులే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*