ఈషా రెబ్బ కు ఎన్ని కష్టాలు..!

troubles for esha rebba

తెలుగు హీరోయిన్స్ టాలీవుడ్ లో రాణించడం కష్టం అనుకున్న టైలో ఈషా రెబ్బా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరిస్తుంది. ఉత్తరాది హీరోయిన్స్ కు తగ్గకుండా తాను కూడా గ్లామర్ పాత్రలు చేస్తానంటూ చెబుతోంది. రీసెంట్ గా ఆమె త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్ తో చేసింది. ఈమెకు ఇదే పెద్ద ఆఫర్ అనుకున్నారు అంతా. కానీ సినిమాలో ఆమె అసలు ఉందా..? లేదా..? అన్నట్టుగా ఆమె పాత్ర ఉంది. ప్రస్తుతం ఈషా రెబ్బా… సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈనెల 7న విడుదలకు సిద్ధం అవుతుంది.

ఆఫర్స్ వస్తున్నా…

అలానే ‘ఎన్టీఆర్’ బయోపిక్ లాంటి పెద్ద సినిమాలో చేసే ఛాన్స్ ఇచ్చాడు డైరెక్టర్ క్రిష్. కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఉండడంతో ఈమెకు స్క్రీన్ షేరింగ్ అసలు ఉంటుందా?..లేదా? అన్నట్లుగానే ఉంటుందేమో. తెలుగు అమ్మాయిలకు తెలుగులో పెద్ద హీరోస్ సినిమాల్లో అవకాశం రావడమే కష్టం. ఒక వేళ వచ్చినా సందట్లో సడేమియా అన్నట్లుగానే ఆమె పాత్ర ఉంటుంది. పాపం ఈషాకి చేతిలో ఆఫర్స్ ఉన్నా సరైన పాత్ర పడడం లేదు. సుబ్రహ్మణ్యపురం సినిమాతో అయినా ఫేట్ మారుతుందేమో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*