‘హిరణ్య కశిప’ ఆగలేదట..!

‘రుద్రమదేవి’ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత డైరెక్టర్ గుణశేఖర్ ‘హిరణ్య కశిప’ అనే సినిమాను తీయనున్నట్టు ప్రకటించాడు. టైటిల్ రోల్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడని..సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించబడుతుంది చెప్పాడు గుణశేఖర్. ఆ తరువాత ఏమైందో ఏంటో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్ డేట్స్ కూడా ఆగిపోయాయి. ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ల‌లేదు. దాంతో ఈ సినిమా ఇక లేనట్టే అని ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో నిర్మాత సురేష్ బాబు ‘అదుగో’ సినిమా ప్రమోషన్స్ లో మీడియా తో మాట్లాడుతూ…. గుణశేఖర్ తో ‘హిరణ్య కశిప’ సినిమా ఆగలేదని క్లారిటీ ఇచ్చారు.

అన్ని భార‌తీయ భాష‌ల్లో

అంతేకాదు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయని.. డైరెక్టర్ గుణశేఖర్ వైపు నుంచి కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి చెప్పాడు. గ్రాఫిక్స్ వర్క్ లండన్ లో జరగనున్నాయని ఈ మూవీకు రానాయే నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలిపాడు. ఈ సినిమాను ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. భారీ బడ్జెట్ తో రూపొందుతుంది కాబట్టి షూటింగ్ ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు సురేష్ బాబు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి చెప్పారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*