నాని సినిమాలో…. వైభవ్..!

నాని ఈ మధ్యన టాలీవుడ్ లో జోరు చూపిస్తున్నాడు. వరస హిట్స్ తో చెలరేగిపోతున్నాడు. సహజ నటనతో నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నానికి కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసినప్పటికీ… మళ్లీ బిగ్ బాస్ సీజన్ 2తో, దేవదాస్, జెర్సీ సినిమాల తో బాగా బిజీగా ఉన్నాడు. అయితే నాని కెరీర్ లో నిన్ను కోరి సినిమా ఒక స్పెషల్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కోన వెంకట్ ఫ్రెండ్స్ తో కలిసి నిర్మించాడు. అయితే ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. నాని – ఆది పినిశెట్టి – నివేద థామస్ కలిసి నటించిన ఈ సినిమాలో లవ్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ లా తెరకెక్కింది.

మక్కీ కి మక్కీ దింపేస్తారా..?

అయితే ఈ సినిమాని కోలీవుడ్ లో వైభవ్ హీరోగా రీమేక్ కాబోతుంది. కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ హీరోగా కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా క్లిక్ అయ్యాడు. అయితే గత ఏడాది మెయ్యాదమాన్ సినిమాతో సోలో హిట్ అందుకున్న వైభవ్ మన తెలుగు వాడే. ఇక తెలుగులో సాలిడ్ హిట్ అయిన నిన్ను కోరి సినిమాని వైభవ్ హీరోగా కాస్మో కిరణ్ అనే నిర్మాత నిర్మించబోతున్నాడు. హీరోగా వైభవ్ నటిస్తున్న ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. అలాగే తెలుగులో అది పినిశెట్టి వేసిన క్యారెక్టర్ ని మల్లీ కోలీవుడ్ లో ఆది ప్లే చేస్తాడో లేదో కూడా సమాచారం లేదు. ఇక హీరోయిన్ గా నివేదని తీసుకుంటారో లేదంటే మరో కొత్తమ్మాయికి అవకాశమిస్తారో అనేది కూడా స్పష్టత లేదు. ఇకపోతే ఈ సినిమాని యాజిటీజ్ గా రీమేక్ చేసే యోచనలో వైభవ్, నిర్మాత ఉన్నట్లుగా తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*