వర్మ చేతిలో అఖిల్ ఆగమేనా…?

mr majnu story copied

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నాగార్జున చేసిన ఆఫీసర్ సినిమా రేపు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ హీరో కూడా వర్మ కి అవకాశం ఇవ్వని టైంలో వర్మ చెప్పిన కథను మెచ్చి నాగార్జున ఎవ్వరిని లెక్క చెయ్యకుండా ఆఫీసర్ సినిమాని చేసాడు. మరి నాగార్జున తో సినిమా చేస్తూ అయినా వర్మ కుదురుగా ఉన్నాడా.. అంటే అదీ లేదు. ఆఫీసర్ సినిమా విడుదల కాక ముందే.. వర్మ పవన్ కళ్యాణ్ ని కెలకడం వంటి పనులు చేసాడు. అయినా నాగార్జున మాత్రం వర్మ మీదున్న నమ్మకాన్ని వదలలేదు సరికదా.. ఇప్పుడు అఖిల్ ఫ్యూచర్ ని కూడా వర్మ చేతిలో పెట్టేలా కనబడుతున్నాడు.

అఖిల్ భవిష్యత్ వర్మ చేతిలో..?

ఆ మధ్యన రామ్ గోపాల్ వర్మ – అఖిల్ కాంబోలో మూవీ అంటూ అనేక వార్తలు సోషల్ మీడియా లో హల్ చల్ చేశాయి. అయితే అదే విషయాన్నీ ఆఫీసర్ ఇంటర్వ్యూ లో భాగంగా నాగ్ ని మీడియా వారు ప్రశ్నించగా.. దానికి నాగార్జున గుంభనంగా వర్మ – అఖిల్ సినిమా చర్చల దశలో ఉందని.. అయినా వారి కాంబోలో సినిమా ఉంటుందని నేనేమి ట్వీట్ చెయ్యలేదు కదా.. అంటూ తెలివైన సమాధానం చెప్పాడు. మరి ఇప్పటికే వర్మ డైరెక్షన్ లో నాగ్ సినిమా చెయ్యడమే తెలివి తక్కువ పని అంటే… ఇప్పుడు పోయిపోయి అఖిల్ కెరీర్ ని కూడా వర్మ చేతిలో పెట్టడమా అంటూ కొందరు ఫీల్ అవుతున్నారు.

ఎన్టీఆర్ తో విభేదాలు ఉన్నాయిగా…

ఇక నాగార్జున ఆఫీసర్ సినిమా ఇంటర్వూలలో భాగంగా అక్కినేని బయోపిక్ ఉండదని స్పష్టం చేసాడు. బయోపిక్స్ లో కేవలం నిజమైన కథతో పాటుగా ఆ వ్యక్తి మీద కాంట్రవర్సీలు కూడా ఉండాలి… అలా లేకపోతె బయోపిక్స్ కి ఆదరణ ఉండదు. కానీ నాగేశ్వరావు గారికి అలాంటి కాంట్రవర్సీలు ఏమీ లేవు. ఆయన బ్రతికినంత కాలం చాలా హ్యాపీ గా, క్లిన్ పర్సన్ గా ఉన్నారు.. అందుకే ఆయన బయోపిక్ తీస్తే ఎవరు చూడరంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. మరి నాగార్జునకి తన తండ్రి గురించిన విషయాలు పెద్దగా తెలియవేమో.. ఎందుకంటే నాగేశ్వరావు గారికి ఎన్టీఆర్ గారికి మాట పట్టింపు రావడం.. చాన్నాళ్లు వాళ్లిద్దరూ మాట్లాడుకోకపోవడం.. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేకం ఉన్నాయి. కాని అవేమి పెద్ద విషయాలేమి కాదు. కానీ.. బయోపిక్స్ తీస్తే అవే పెద్ద విషయాలుగా చూపించొచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*