‘అంత‌రిక్షం’ సినిమా సూపర్ హిట్ సాక్షం ఇదిగో

varun tej

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి – అదితిరావు హైద‌రి నటిస్తున్న ‘అంత‌రిక్షం 9000 KMPH’ చిత్రంను ‘ఘాజీ’ ఫేం సంక‌ల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై క్రిష్ జాగర్లమూడి,సాయిబాబు, రాజీవ్‌రెడ్డిలు నిర్మిస్తున్న ఈచిత్రం రీసెంట్ గా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ లో కూర్చుంది. ఈనెల 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమా యొక్క సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను తాజాగా పూర్తి అయ్యాయి.

థ్రిల్లర్ గా సాగే ఈసినిమాకు క్లీన్ “యు” స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ స‌భ్యులు. మిరా అనే శాటిలైట్‌ అనుకోకుండా దారి తప్పటంతో ప్రపంచంలోని కంమ్యూనికేషన్‌ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. ఏమి చేయాలో అర్ధం కానీ స్థితిలో దేవ్ అనే వ్యక్తి ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంట్రీ ఇస్తాడు. మరి దేవ్ ఆ శాటిలైట్‌ మళ్ళి తిరిగి దారిలోకి ఎలా తీసుకుని వస్తాడో అనేది మిగిలిన సినిమా అని అంటున్నారు. ‘ఘాజీ’ సినిమాతో ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేసిన సంకల్ప్ మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగులో ఇటువంటి స్పేస్‌ సినిమాలు ఇప్పటివరకు ఒక్కటి కూడా రాలేదు.ఇదే తొలి సినిమా. సో ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు.

చిత్రం చూసిన సెన్సార్ స‌భ్యులు, చిత్ర యూనిట్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించార‌ట. ఈచిత్రంతో డైరెక్టర్ సంక‌ల్ప్ రెడ్డి అందరిని స్టన్ చేస్తాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ లోనే చూపించారు కానీ బిగి స‌డ‌ల‌ని క‌థ‌నంతో ప్రేక్ష‌కుల‌ని సీట్ల‌కు అతుక్కునిపోయేలా చేస్తుంద‌ట ఈ చిత్రం. కొన్నికొన్ని సీన్స్ అయితే ఆడియన్స్ ని థ్రిల్ చేయ‌డం గ్యారెంటీ అని యూనిట్ చెబుతుంది. క్రిష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు సమాచారం. మరి ఏమవుతుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*