100 కోట్ల క్లబ్ లో బికినీ బేబీస్..!

బాలీవుడ్ ఇండస్ట్రీ కి వంద కోట్ల క్లబ్ కొత్తేమీ కాదు. మీడియం రేంజ్ సినిమాలకి కూడా అక్కడ ఊరికే వంద కోట్లు వస్తుంటాయి. కానీ ఇక్కడ మన పెద్ద స్టార్ సినిమాలకి మాత్రమే ఆలా కలెక్షన్స్ వస్తుంటాయి. బాలీవుడ్ లో హీరోల సినిమాలకి ఇలా కలెక్షన్స్ రావడం కామన్ కానీ అక్కడ ఈమధ్య ఫిమేల్ సెంట్రిక్ గా చిత్రాలకి కూడా 100 కోట్ల వస్తుండం పెద్ద విషయమే.

13 రోజుల్లోనే వంద కోట్లు…

లేటెస్ట్ గా శశాంక్ ఘోష్ దర్శకత్వంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియా ప్రధాన పాత్రలలో నటించిన ‘వీరి డి వెడ్డింగ్’ మూవీ ఇప్పుడు 100 కోట్ల వసూళ్లను టచ్ చేసి రికార్డు సృష్టించింది. రిలీజ్ అయినా 13 రోజులకే ఈ సినిమా ఈ ఫీట్ అందుకోటం పెద్ద విషయమే. తొలివారం రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో 54.46 కోట్లను రాబట్టింది.

సల్మాన్ చిత్రం విడుదలతో బ్రేక్…

13 రోజుల్లో ఇండియా వరకు 75 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్స్ ను సాధించగలిగింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఈరోజు నుండి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ మూవీ రేస్3 రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో సల్మాన్ అందరి మతిపోగొట్టాడు. దీంతో ఈ సినిమా కచ్చితంగా వసూళ్ల వర్షం కురిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.