వెంకీ చితకొట్టేస్తున్నాడు..!

venkatesh back to form with f2

ఈ సంక్రాంతి రేస్ లోని నాలుగు సినిమాల్లో నిన్న ఆఖరి సినిమా ఎఫ్ 2 రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ గా ఉందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ కు డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఫైనల్ గా పక్కా కామెడీ ఎంటర్టైనర్ అని పేరు వచ్చేసింది. నిన్నటి నుండి సెలవులు కావడంతో అందరూ ఈ సినిమా చుడటానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కథ పరంగా గొప్పగా ఏమీ లేకపోయినా స్క్రీన్ ప్లే, వెంకీ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ యాక్షన్, తమన్నా, మెహ్రీన్ గ్లామర్ షో సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ముందు నుండే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అదీకాక నవ్వులు గ్యారెంటీ అనే మాట బయటికి రావడంతో ఇదంతా సినిమాకు ప్లస్ అయింది.

ఆ సినిమాలు గుర్తొస్తాయి…

ముఖ్యంగా అందరూ వెంకీ కామెడీ టైమింగ్ గురించి మాట్లాడుతున్నారు. చాలా కాలం తరువాత వెంకీ తనదైన రీతిలో కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన తీరుతో పాత రోజులను గుర్తు చేసాడని మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం వెంకీ తన భుజాలపై మోసి సోలోగా నడిపించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడానికి కారణం వెంకీ పెర్ఫార్మన్స్ అంటున్నారు. ఎప్పుడో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి నాటి వెంకీ బ్రాండ్ కామెడీ ఇందులోనే చూశామన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వరుణ్ తేజ్, వెంకీ కొన్ని సీన్స్ లో బాగా నవ్వించారు. ఇది వెంకీకి కంబ్యాక్ చిత్రం అవుతుందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ సెలవుల్లో ఈ సినిమా ఆడుతున్న హాల్స్ అన్నీ హౌస్ ఫుల్ అవ్వడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*