వెంకీ, చైతు ల మూవీ టైటిల్ ‘వెంకీ మామ’?

venky mama movie rights

ప్రస్తుతం వెంకటేష్ లాంగ్ గ్యాప్ తీసుకుని వరసబెట్టి మల్టీస్టారర్ లకు కమిట్ అవుతున్నాడు. వరుణ్ తేజ్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 2 తో సెట్స్ మీదున్నాడు. ఇక దర్శకుడు త్రినాధరావు నక్కిన తో వెంకటేష్ పోలీస్ గెటప్ లో మరో హీరో తో కలిసి ప్రసన్న కుమార్ కథతో ఒక సినిమాలో నటించబోతున్నాడని టాక్ ఉంది. ఇక మరో మల్టీస్టారర్ అంటే బాబీ డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ ఆయన మేనల్లుడు హీరో నాగ చైతన్య తో కలిసి ఒక కుటుంబ కథా మల్టీస్టారర్ చెయ్యాల్సి ఉంది. అయితే ఆ సినిమా ప్రచారంలో ఉంది గాని.. ఇంతవరకు ఆ సినిమా విషయాలేమి అధికారికంగా వెల్లడి కాలేదు.

తాజాగా గత వారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ నగరానికి ఏమైంది సినిమా సురేష్ ప్రొడక్షన్ లోనే తెరక్కేకింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న సురేష్ బాబు ఈ మధ్యన చిన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తూ పెద్ద ప్రాజెక్ట్ ల జోలికి వెళ్లడం లేదు. మరి మిగతా నిర్మాతలు అంతా పెద్ద సినిమాలు అంటూ 100 నుండి 300 కోట్ల భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. అదే విషయాన్నీ మీడియా మిత్రులు సురేష్ బాబుని ప్రశ్నించగా.. ఈ మధ్యన చిన్న సినిమాలు చేస్తూ వచ్చామని.. గతంలోలా మళ్ళీ బిగ్ ప్రాజెక్టులను నిర్మిస్తామని.. అలాగే ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ వెంకటేష్ – నాగ చైతన్యల మల్టీస్టారర్ భారీ పెట్టుబడితోనే నిర్మించబోతున్నట్టుగా లీక్ చేసాడు.

అంతేకాకుండా ఆ సినిమా టైటిల్ కూడా ‘వెంకీ మామ’గా అనుకుంటున్నట్లుగా చెప్పాడు. మరి వెంకటేష్, నాగ చైతన్య ఒరిజినల్ గా మామ అల్లుళ్ళు. ఇక సినిమాలోనూ చైతు అల్లుడిగా వెంకటేష్ మామగా కనిపిస్తారన్నమాట. అందుకే అందరూ మెచ్చేలా వెంకీ మామ అని టైటిల్ కూడా సెట్ చేస్తున్నారు. మరి మామగా వెంకటేష్ అల్లుడిగా నాగ చైతన్య ల పెర్ఫార్మన్స్ కి బాబీ డైరెక్షన్ ఎలా వుండబోతుందో అనేది త్వరలోనే క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*