వెంకీ ఇచ్చే సర్ప్రైజ్ ఏమిటంటారు..?

వెంకటేష్ దగ్గుబాటి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఇప్పటికి అంటే ఈ రోజుకి(14-08-18) 32 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. సోలో హీరోగా, మల్టీస్టారర్ మూవీస్ లో వెంకటేష్ కి మంచి గుర్తింపు ఉంది. సీనియర్ హీరో అయినప్పటికీ.. ఇప్పటికీ సినిమాల మీద సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు వెంకటేష్. ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంకీ సినిమాలంటే ఎనలేని అభిమానం. అందుకే వెంకటేష్ ఎక్కువగా చేసిన సినిమాలన్నీ కుటుంబ కథ చిత్రాలుగా ఉన్నాయి. కలియుగ పాండవులు, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం ఇంకా వెంకీ కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాల లిస్ట్ చాలా పెద్దది మాస్ హీరోగా కన్నా ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కి మంచి పేరుంది.

మీ అందరికీ సర్ ప్రైజ్ ఇస్తాను…

అయితే ఈ 32 ఏళ్లుగా తనని అభిమానించిన అభిమానాలతో పాటుగా తన చిత్రాలకు పనిచేసిన.. దర్శక నిర్మతలు, టెక్నీషియన్స్ కి వెంకటేష్ సోషల్ మీడియాలో కృతఙ్ఞతలు తెలియజేసాడు. తనని ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న వారికీ కృతఙ్ఞతలు తెలుపుతూ వెంకీ.. ‘‘1986, ఆగస్టు 14న నా తొలి చిత్రం కలియుగ పాండవులు విడుదలైంది. ఈ రోజే నేను నటుడిగా జన్మించాను. 32 ఏళ్లుగా మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతూనే ఉన్నా… అందుకు నేనెంతో అదృష్టవంతుడిని. నేను నా సినీ ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేయబోతున్నాను. దీని ద్వారా మీ అందరికీ మరింత దగ్గరవుతాను. త్వరలోనే మీకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నా’’ అంటూ ట్వీట్ చేసాడు.

నిర్మాతగా.. దర్శకుడిగా మారతాడా..?

మరి ఇప్పుడు తాజాగా వెంకీ ట్వీట్ పై కొత్త చర్చ ప్రారంభమైంది. అదేమిటంటే.. వెంకీ అభిమానులకి అందరికీ కృతఙ్ఞతలు చెప్పడం బాగానే వుంది.. కానీ ఆయన ఇచ్చే ఆ సర్ప్రైజ్ ఏమిటంటూ ఫిలిం సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు తెరలేపారు. అంటే వెంకటేష్ తన అన్న మాదిరిగా నిర్మతగా మారుతాడా..? లేదంటే డైరెక్టర్ గా మారుతున్నాడా..? ఏమిటా సర్ప్రైజ్ అంటూ తెగ చర్చించేస్తున్నారు. మరి వెంకీ ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏమిటో తెలియదు గాని… వెంకీ మాత్రం ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఎఫ్ 2 తో పాటు నాగ చైతన్యతో మరో మల్టీస్టారర్ ని బాబీ డైరెక్షన్ లో మొదలు పెట్టాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*