తమిళ హీరోతో వెంకీ మల్టీస్టారర్..?

ప్రస్తుతం వెంకటేష్ సోలో హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నాడో.. మరో హీరోతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు కూడా అన్నే చేస్తున్నాడు. తన వయసుకు తగ్గ కథలను ఎంచుకుంటున్న వెంకటేష్ గురు సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తో వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే నాగ చైతన్యతో కలిసి బాబీ డైరెక్షన్ లోనూ ఒక మల్టీస్టారర్ చేయనున్నాడు. ఇలాగే గతంలోనూ టాలీవుడ్ టాప్ హీరోస్ తో మల్టీస్టారర్ సినిమాలు చేసాడు వెంకీ. మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యణ్ గెస్ట్ రోల్ చేసిన గోవిందా గోవిందా సినిమాల్లో నటించాడు. అయితే గురు తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా చెయ్యని వెంకీ ఇప్పుడు వరుణ్ తో ఒక సినిమా చేయాడంతో పాటుగా.. మరో డైరెక్టర్ కి మరో మల్టీస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సమాచారం.

సూర్యను తెలుగుకు పరిచయం చేసేందుకు….

నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాల దర్శకుడు త్రినాథ రావు తో వెంకటేష్ ఒక మల్టీస్టారర్ చెయ్యడానికి సిద్దమవుతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే వెంకీ కి త్రినాథ రావు చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందట. కానీ ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారట. ఒకరు వెంకటేష్ కాగా మరో హీరోని సెట్ చేసే పనిలో ఉన్నారట. అయితే ద్విభాషా చిత్రం గా తెరకెక్కనున్న ఈ చిత్రం లో వెంకీ తో పాటుగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ని సంప్రదిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమా ద్వారా సూర్య ని తెలుగుకి గ్రాండ్ గా పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో… త్రినాథ రావు చెన్నైలో సూర్యను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

త్వరలోనే మరో మల్టీస్టారర్…

మరి సూర్య సినిమాలు కోలీవుడ్ తో పాటుగా తెలుగులోనూ బాగా ఆడతాయి. అందుకే సూర్య కూడా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా టాక్. అసలు సూర్య కార్తీ సినిమా చినబాబు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడే.. త్రినాథ రావు కలిసి సూర్యకి స్టోరీ లైన్ వినిపించాడని.. అయితే ప్రస్తుతమున్న బిజీ షెడ్యూల్ తో పూర్తిగా కథ వినలేను కాబట్టి చెన్నై వచ్చి కలవమని చెప్పినట్టుగా కొన్ని వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.మరి ఇలా వెంకటేష్ కి మరో మల్టీస్టారర్ ఒకే అయితే.. వెంకీ బాబు మల్టీస్టారర్ బాబు అవుతాడేమో.. అంటూ కామెంట్స్ పడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*