విద్యా బలం అనుకుంటే… బలహీనత అయ్యిందే..!

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విషయంలో దర్శకుడు క్రిష్ చాలా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేస్తూ షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. సినిమాలోని ఫస్ట్ లుక్స్ ని సందర్భానుసారంగా వదులుతూ… అందరిలో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమా లో ఎన్టీఆర్ భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. అయితే అందరి కన్నా ముందే విద్యాబాలన్ తన కేరెక్టర్ కి సంబందించిన షూటింగ్ పూర్తి చేసింది. లుక్స్ లో మొదటగా విద్యాబాలన్ ది విడుదల చేద్దామని క్రిష్ – బాలకృష్ణ మొదట్లో భావించినా అనుకోకుండా ఏఎన్నార్ బర్త్ డే సందర్భంగా ఏఎన్నార్ లుక్ ని విడుదల చేసింది. అయితే రేపు దసరా సందర్భంగా హరికృష్ణ పాత్రలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ లుక్ ని విడుదల చేస్తారని ప్రచారం జరిగినా ఈ సినిమాలో బసవతారకం పాత్ర చేస్తున్న విద్యాబాలన్ లుక్ ని వదలబోతున్నారట.

విద్యాబాలన్ తొందరపాటు

అయితే రేపు విడుదల కావాల్సిన బసవతారకం లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. క్రిష్ అండ్ ఎన్టీఆర్ టీం ఇంకా బసవతారకం లుక్ వదలకుండానే విద్యాబాలన్ ఒకింత క్యూరియాసిటీతో బసవతారకం గెటప్ లో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో… ఎన్టీఆర్ టీం ఒకింత షాక్ కి గురైంది. తామెంతో ఇంట్రెస్టింగ్ గా లుక్ విడుదల చేద్దామంటే విద్యాబాలన్ ఇలా చేసేసరికి వారికి షాక్ కొట్టింది. అయితే విద్యాబాలన్ తేరుకుని ఆ ఫోటో ని సోషల్ మీడియాలో డిలీట్ చేసే సరికే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కూర్చుంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం లుక్ ఆఫీసియల్ వదులుతారో లేదో…!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*