100 కోట్ల క్లబ్ లోకి విజయ్ దేవరకొండ..?

కేవలం నాలుగే నాలుగు సినిమాలతో మన హీరో 100 కోట్ల క్లబ్ లో త్వరలో చేరనున్నాడు. ఏంటి నాలుగు సినిమాలకే 100 కోట్లు క్లబ్బా.? అని ఆశ్చర్యపోతున్నారా.? అవును నిజమే. విజయ్ దేవరకొండ నాలుగో సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరనున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ స్టార్ హీరోగా డిక్లేర్ అయినట్టే. ఇప్పటివరకు ఏ హీరోకి సాధ్యపడని ఫీట్ ఇతను అందుకోనున్నాడు.

ఇప్పటికే 75 కోట్లు..!

లేటెస్ట్ గా రిలీజ్ అయినా గీత గోవిందం ఇప్పటికే 75కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. గీత ఆర్ట్స్ దేవరకొండను 75కోట్ల గ్రాస్ హీరో అని పోస్టర్ రూపంలో ప్రకటించింది. ప్రస్తుతం అదే స్పీడ్ తో విజయ్ 100కోట్ల క్లబ్ దాటేందుకు పరుగులు తీస్తున్నాడని చిత్ర బృందం ధీమాగా ఉంది. అయినా 75కోట్ల నుంచి ఇక 100 కోట్ల క్లబ్ వైపు పరిగెత్తేందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఇటువంటి స్క్రిప్ట్ విజయ్ తో చేయించినందుకు పరశురామ్ ని.. ఎంకరేజ్ చేసిన గీతా ఆర్ట్స్ సంస్థను పొగిడేయాలి. ఇంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ సినిమా నుండి విజయ్ పై భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే స్టార్ హీరో ఇమేజ్ విజయ్ కి వచ్చింది కాబట్టి. మరి ఆ ఇమేజ్ ను ఎంతవరకు కాపాడుకుంటాడో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*