విజయ్ – అట్లీ సినిమాల్లో స్టార్ హీరోయిన్స్..!

Vijay role in Atlee film

మురగదాస్ – విజయ్ కాంబినేషన్ వచ్చిన ‘సర్కార్’ ఎన్నో కాంట్రవర్సీస్ మధ్య విడుదల అయ్యి డివైడ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తుంది. ఈ సినిమా తరువాత ఇళయ దళపతి విజయ్ 63వ చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టేసాడు. గతంలో విజయ్ తో తేరి, మెర్సల్ చిత్రాలు తీసి సక్సెస్ అందించిన డైరెక్టర్ అట్లీతో విజయ్ మరోసారి చేయనున్నాడు. స్టోరీ కూడా ఓకే అయిపోవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ లో ఈ సినిమా బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో ఇందులో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట డైరెక్టర్ అట్లీ.

హ్యాట్రిక్ కొడతారా..?

నయనతార, సమంత ఇందులో నటించబోతున్నట్లు సమాచారం. విజయ్ తో నయనతార గతంలో ‘విల్లు’ చిత్రంలో నటించింది. సమంత తేరి, మెర్సల్ చిత్రాల్లో నటించింది. ముచ్చటగా మూడోసారి విజయ్ తో నటించబోతుంది. ‘రాజారాణి’ తరువాత విజయ్ తో బ్యాక్ టూ బ్యాక్ తేరి, మెర్సల్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన అట్లీకి మరోసారి విజయ్ ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం మాములు విషయం కాదు. ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని విజయ్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*