విజయ్ జోక్ చేస్తున్నాడా..?

chiranjeevi hit film title to vijay film

ప్రస్తుతం విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీత గోవిందం మ్యానియా టాక్సీవాలా విషయంలో పనిచేయడం లేదనేది తెలిసిన విషయం. అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసి.. గీత గోవిందంతో 100 కోట్ల క్లబ్బులో సగర్వంగా కాలు పెట్టాడు విజయ్. ఒక్కసారిగా స్టార్ హీరో అవతారమెత్తిన విజయ్ దేవరకొండ తన సినిమా టాక్సీవాలా విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నాడు. అయితే టాక్సీవాలా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ… సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసేలా మట్లాడుతున్నాడు. సినిమా మొత్తం పైరసీ బారిన పడినప్పటికీ.. ఏమాత్రం లెక్కచెయ్యకుండా సినిమాని థియేటర్స్ లో దింపుతున్న విజయ్ గట్స్ ని మెచ్చుకోవాలి.

2.ఓ తర్వాత టాక్సీవాలానే

ఇక తన టాక్సీవాలా సినిమా సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉందని చెప్పిన విజయ్ దేవరకొండ ఒక జోక్ చేసాడు. అదేమిటంటే తమిళనాట 600 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కించిన 2.ఓ సినిమాపై దేశం మొత్తం మీద భారీ అంచనాలున్నాయి. అలాగే 2.ఓ మీద ఎలాంటి న్యూస్ అయినా, వీడియో అయినా, ఫోటో అయినా క్షణాల్లో వైరల్ అవుతూ టాప్ ట్రెండింగ్ లో ఉంది. అయితే యూట్యూబ్ వీడియోస్ లో 2.ఓ తర్వాత తన టాక్సీవాలా చిత్రమే ట్రేండింగ్ లో ఉందని చెప్పి జోక్ చేస్తున్నాడు విజయ్. జోక్ కాదు విజయ్ రియల్ గా ట్వీట్ కూడా చేశాడు.

నా వెంట మీరు… మీ వెంట నేను

విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ… కేవలం యూట్యూబ్ లోనే కాదు… బుక్ మై షోలో కూడా చాలామంది ఏంటో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న రెండో చిత్రం టాక్సీవాలా అని అన్నాడు. తాను చేసే సినిమాల స్క్రిప్టులు ఎలా ఉండాలో అభిమానులే ఎంచుకుంటారని అన్నాడు. మీ వెనుక నేను, నా వెనుక మీరు ఎల్లప్పుడూ ఉండి ప్రేమను పంచుతారు అంటూ ట్వీట్ చేసి టాక్సీవాలా సినిమాపై డిఫ్రెంట్ ప్రమోషన్స్ చేసాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*