విజయ్ క్రేజ్ మరింత పెరిగిందా..?

Chiranjeevi appriciated Taxiwala team

గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోలకు కూడా సాధ్యమవని 100 కోట్ల క్లబ్బులోకి ఈజీగా అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ. కానీ నోటా సినిమా ఫ్లాప్ పడేసరికి.. అందరికీ విజయ్ క్రేజ్ అమాంతం పడిపోయిందని… ఇక విజయ్ కొత్త సినిమాల మార్కెట్ ఎలా ఉంటుందో అనే సందేహాలు వ్యక్తం చేశారు చాలామంది సినీజనాలు. ఇక విజయ్ తాజా చిత్రం టాక్సీవాలా విడుదలవడమే కానీ.. ఆ సినిమా హిట్ అవదని, విజయ్ క్రేజ్ ఎందుకు పనిచేయదని అన్నారు. సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా విజయ్ గట్టి ప్రమోషన్స్ తో బరిలోకి దిగాడు. మరి విజయ్ కూడా నమ్మలేనట్టుగా టాక్సీవాలా పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

వీకెండ్స్ లానే కలెక్షన్స్

గత కొంతకాలంగా సరైన సినిమా లేక ఉసూరుమంటున్న ప్రేక్షకులను టాక్సీవాలా మంచి ఎంటర్టైన్ చేస్తుంది. టాక్సీవాలా హిట్ తో విజయ్ దేవరకొండ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఫస్ట్ వీకెండ్ లోనే దుమ్ముదులిపిన టాక్సీవాలా వీక్ డేస్ లోనూ దూసుకుపోతుంది. సోమవారం థియేటర్స్ లో టాక్సీవాలా డ్రాప్ అవుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. శని, ఆదివారాల్లో మాదిరి సోమవారం థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ పడలేదు కానీ.. ఆక్యుపెన్సీ మాత్రం చాలా బాగుంది. కానీ నైట్స్ షోస్ మాత్రం కళకళలాడుతున్నాయి.

మరింత పెరిగిన విజయ్ క్రేజ్

ఇక బుధవారం కూడా సెలవు దినం కావడంతో టాక్సీవాలాకి వచ్చిన పాజిటివ్ టాక్ తో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక ఎలాగూ శుక్రవారం చిన్న చిన్న సినిమాలను దాటుకుని… రజనీకాంత్ 2.ఓ వచ్చేవరకు టాక్సీవాలాకైతే ఎదురు లేదనేది తెలుస్తుంది. మరి విజయ్ రేంజ్, క్రేజ్ టాక్సీవాలతో మరింత పుంజుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*