ఇదేంటి సడన్ గా ఇలా చేసాడు విజయ్!

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత ఇంకో బ్లాక్ బ్లాస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఎప్పటినుండో ‘టాక్సీ వాలా’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ అంటూ హడావిడి చేసిన ఆ తర్వాత సడన్ గా సైలెంట్ అయిపోయి ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ ని సాకుగా చూపుతున్నారు.

ఎందుకు ఫెయిలవుతున్నారు?

గీత ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలు అండ ఉన్న సినిమాను ముందుకు తీసుకుని రావడంలో ఫెయిల్ అవుతున్నారు. అందుకు కారణం ఆ సినిమా డైరెక్టర్ రాహుల్ సంక్రీత్యాన్ సరిగ్గా డీల్ చేయలేకపోవడం. మేకర్స్ కి ఈ సినిమాపై నమ్మకం కూడా పోయిందని తెలుస్తుంది. అందుకే దీన్ని పక్కన పెట్టేసి విజయ్ ‘గీత గోవిందం’ సినిమాను లైన్ లోకి తీసుకొచ్చాడు.

దానికంటే ముందుగానే…..

ఈ సినిమా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఇది కూడా కొంత భాగం రీ షూట్ చేసుకున్న సినిమానే అని టాక్. నిన్న ఈ సినిమా టైటిల్ లుక్ రిలీజ్ చేసారు. విజయ్ కి జోడిగా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆగస్ట్ లో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే టాక్సీ వాలా వస్తుందనుకుంటున్న టైంలో గీత గోవిందం ను హటాత్తుగా తెరమీదకు తీసుకురావడం ఏమిటి అని.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*