విజయ్ కు ఇప్పుడుంది అసలైన పరీక్ష..!

ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ పేరు యూత్ తో పాటు టాలీవుడ్ లో కూడా మారుమ్రోగిపోతోంది. అతని సక్సెస్ లే అందుకు కారణం. 25 సినిమాలు చేసిన హీరోలకి కూడా రాని క్రేజ్ విజయ్ కి వస్తుంది. అంతేకాదు ఓవర్సీస్ లో కూడా మనోడి రేంజ్ పెరిగిపోయింది. మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా చేరిపోయాడు. ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటిన హీరోలు సైతం క్రేజ్ కోసం కిందా మీదా పడుతుంటే.. విజయ్ మాత్రం కేవలం మూడు సూపర్ హిట్స్ తో ఆ స్థాయికి వెళ్ళిపోయాడు.

మూడు సినిమాలతోనే పెరిగిన క్రేజ్

ఒకటి ‘పెళ్లి చూపులు’. రెండోది ‘అర్జున్ రెడ్డి’. ఇప్పుడు ‘గీత గోవిందం’. ఈ మధ్యలో ‘ద్వారక’, ‘ఏ మంత్రం వేసావే’ డిజాస్టర్స్ తో పాటు ‘మహానటి’ క్యామియోని జనం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే జనాలు ఈ మూడు సినిమాలే లెక్కలోకి తీసుకుంటున్నారు. కేవలం మూడు సినిమాలకే విజయ్ ఇంత స్థాయికి చేరుకోడం మాములు విషయం కాదు. అతని సక్సెస్ చూసి మిగిలినవాళ్లు ఈర్ష పడటంలో ఆశ్చర్యం లేదు.

జాగ్రత్తలు తీసుకోకపోతే…

అయితే ఇప్పుడుండి విజయ్ కు అసలు పరీక్ష. అతను ఈ టైంలోనే స్టోరీస్ మీద దృష్టి పెట్టి మంచి సినిమాలు చేస్తే స్టార్ హీరో అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే విజయ్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ‘టాక్సీవాలా’, ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’ లైన్స్ ని చూస్తే అర్థమైపోతోంది. గతంలో తరుణ్, ఉదయ్ కిరణ్, వరుణ్ సందేశ్ లను చూసుకుంటే..వారు మరీ ఇంత కాకపోయినా ఏదో ఒక్క సినిమాతో స్టార్లు అయినవాళ్లే. కాకపోతే వారు చేతులారా చేసుకున్న తప్పిదాల వల్ల వరస పరాజయాలతో ఆఖరికి పరిశ్రమలో లేకుండా పోయారు. అందుకే విజయ్ వారిని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తే మంచిది అంటున్నారు ట్రేడ్ జనాలు. లేకపోతే పది సినిమాల తర్వాత విజయ్ ఎక్కనున్నాడు అని వెతుక్కోవాల్సి వస్తుంది అంటున్నారు. సక్సెస్ వచ్చినప్పుడు తన చుట్టూ చేరే భజన బ్యాచ్ ను పక్కన పెట్టేసి పూర్తి దృష్టి సినిమాల మీద పెడితే స్టార్ హీరో అవ్వడానికి పెద్ద టైం ఏమీ పట్టదు. అల్లు అరవింద్ చెప్పినట్టు స్టార్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*