విజయ్ కి ఎదురు లేదు!

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో గోల్డ్ ఫేస్ విలన్ గా, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానికి ఫ్రెండ్ గా నటించిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. సినిమా హిట్ అయినా విజయ్ కి ఓ అన్నంత క్రేజ్ అయితే రాలేదు. కానీ విజయ్ దేవరకొండ ఆ తర్వాత చేసిన ద్వారకా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత సందీప్ వంగా డైరెక్షన్ లో చేసిన అర్జున్ రెడ్డి అనేక కాంట్రవర్సీల మధ్య విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ దెబ్బకి విజయ్ దేవరకొండ పేరు ఇండస్ట్రీలోనే కాదు మొత్తమంతా మార్మోగిపోయింది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది.

మంచి మార్కులు పడటంతో…

అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన ఏం మంత్రం వేశావే సినిమా ఫ్లాప్ అయ్యాక విజయ్ దేవరకొండ బిగ్ బ్యానర్ అయిన గీత ఆర్ట్స్ లో పరశురామ్ డైరెక్షన్ లో గీత గోవిందం సినిమా చేసాడు. మంచి రొమాంటిక్ కథతో తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా గీత గోవిందం సినిమాకి పాజిటివ్ టాక్ ఇచ్చారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. విజయ్ నటన గోవింద్ పాత్రలో సహజ సిద్ధంగా ఆకట్టుకుంది. సినిమాలో 75 శాతం విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మీదే కథ నడుస్తుంది.

విజయ్ నటనకు ఫిదా..!

మరి అన్ని సీన్స్ లోను హీరో హీరోయిన్స్ ఉన్నపటికీ.. సినిమా బోర్ కొట్టించకుండా దర్శకుడు పరశురామ్ మేనేజ్ చేయగలిగాడు. సినిమాలో అక్కడక్కడా.. ఫేక్ సీన్స్ ఉన్నప్పటికీ… కామెడీతో మేనేజ్ చేశారు. మరి గోవింద్ పాత్రలో లెక్చరర్ గా, అమ్మాయిని పడెయ్యడానికి పాటుపడే లవర్ గా… విజయ్ దేవరకొండ తన క్యారెక్టర్ లో సెట్టిల్డ్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. కొంత ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ తో కూడిన గోవింద్ క్యారెక్టర్ తో ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు. మరి ఈ సినిమాతో విజయ్ మళ్లీ హిట్ కొట్టేసి.. హీరోగా సూపర్ అనిపించేసాడు. మరి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ కాస్త.. ఇపుడు గోవిందుడు యాటిట్యూడ్ గా మార్చేస్తాడేమో చూద్దాం. ఇక ఈ సినిమా హిట్ తో విజయ్ మార్కెట్ అమాంతం పెరిగిపోవడమే కాదు… విజయ్ క్రేజ్ డబుల్ అవడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*