టాక్సీవాలా చెయ్యకూడదనుకుని.. చేశానంటున్న విజయ్

విజయ్ కెరీర్లో పెళ్లి చూపులు అనుకోకుండా బిగ్గెస్ట్ హిట్ అయితే.. అర్జున్ రెడ్డి కాంట్రవర్సీలతో సూపర్ హిట్ అయ్యింది. ఇక గీత గోవిందం కూడా చిన్న సినిమాగా అదరగొట్టే కలెక్షన్స్ తో అదిరిపోయే హీరో రేంజ్ కి తీసుకొచ్చింది విజయ్ ని. మరి ఇంత పెద్ద హిట్స్ కొట్టిన విజయ్ దేవరకొండ ఒక సినిమా విషయంలో మాత్రం బాగా టెంక్షన్ పడుతున్నాడు. విజయ్ తాజా చిత్రం టాక్సీవాలా సినిమా రేపు 17 న విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా కి మొదటినుండి విడుదల కష్టాలు ఎదుర్కొంటుంది. గత నెలలోనైతే టాక్సీవాలా సినిమా మొత్తం లీకైపోయింది.

మరి అలాంటి సినిమాని థియేటర్స్ లోకి తీసుకొస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు బాగా కష్టపడుతూ ఇంటర్వూస్, ప్రెస్ మీట్స్ అంటూ తెగ హడావిడి చేస్తున్నాడు. అయితే పలు ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తున్న విజయ్ ముందు టాక్సీవాలా సినిమాలో నటించకూడదనుకున్నాడట. అసలు టాక్సీవాలా కథ పెళ్లి చూపులు సినిమా తర్వాతే తన దగ్గరికి వచ్చిందట. పెళ్లి చూపులు తర్వాత పెద్ద బ్యానర్ యువి క్రియేషన్స్ నుండి ఒక కథ వినమని చెప్పారట. అయితే దర్శకుడు రాహుల్ సంకిర్త్యన్ టాక్సీవాలా కథను విజయ్ కి వినిపించగా… కథ మొదట్లోనే ఇదొక హార్రర్ జోనర్ లో ఉన్న సినిమా అని చెప్పడంతో… వెంటనే నా వల్ల హార్రర్ సినిమాలు అస్సలు కావు అని చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడట విజయ్.

కానీ రాహుల్ సంకిర్త్యన్ పట్టువదలని విక్రమార్కుడిలా విజయ్ కి టాక్సీవాలా కథ మొత్తం వినిపించాక ఆ కథమీద పూర్తి నమ్మకమోతోనే విజయ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నానని చెబుతున్నాడు. మరి విజయ్ నమ్మకాన్ని టాక్సీవాలా నిలబెడుతుందో.. లేదంటే నోటా సినిమాలాగే అటకెక్కుతుందో అనేది మాత్రం ఈ నెల 17 న కానీ తెలియదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*