విజయ్ దేవరకొండ క్రేజ్ చూశారా..?

chiranjeevi hit film title to vijay film

చిరుతతో కెరీర్ స్టార్ట్ చేసి రెండో సినిమా మగధీతోనే ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టిన రామ్ చరణ్ ఇప్పటికి 11 సినిమాలు పూర్తి చెయ్యగా… 12వ సినిమా ఇంకా సెట్స్ మీదుంది. అలాంటి రామ్ చరణ్ సరసన కేవలం ఐదారు సినిమాల విజయ్ దేవరకొండ చేరాడు. పెళ్లి చూపులు సినిమా తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ యూత్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఈ ఏడాది గీత గోవిందం, టాక్సీవాలాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో రేర్ ఫీట్ సాధించాడు. అది కూడా ప్రతిష్ఠాత్మకమైన ఫోర్బ్స్ జాబితాలో తనకి స్థానాన్ని సంపాదించుకున్నాడు.

రామ్ చరణ్ తో కలిసి ర్యాంక్

ఇండియాలో టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ పేరు కూడా చేరింది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో సౌత్ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫస్ట్ ప్లేస్ ని ఆక్రమించగా… పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ ఈ జాబితాలో ప్లేస్ సంపాదించాడు. ఇక అది కూడా రామ్ చరణ్ తో కలిసి పంచుకున్న నెంబర్ లో విజయ్ పేరు ఉండడం అనేది విజయ్ కి పెరిగిన క్రేజ్ కి నిదర్శనం. ఫోర్బ్స్ సెలబ్రిటీస్ లిస్ట్ లో 72వ ర్యాంక్ ని రామ్ చరణ్ తో కలిసి షేర్ విజయ్ కి చేసింది. మరి మగధీర, రంగస్థలం సినిమాలతో రామ్ చరణ్ కి కూడా క్రేజ్ బాగా వచ్చింది. ఇక చాలా తక్కువ సినిమాలతోనే విజయ్ దేవరకొండ ఈ రేర్ ఫీట్ సాధించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*