విజయ్ కి అన్ని అలా కలిసొచ్చేస్తున్నాయ్

విజయ్ దేవరకొండ vijay devarakonda

ఆగష్టు 15 న విజయ్ గీత గోవిందం విడుదలై సూపర్ హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తెచ్చుకుంది గత వారం విడుదలైన ఆటగాళ్లు తో సహా ఏ సినిమా మెప్పించలేకపోవడం గీత గోవిందానికి కలిసొచ్చింది. ఇక ఈ వారం రెండు తెలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అందులో ఒకటి నాగ శౌర్య నటించిన @నర్తనశాల ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక శుక్రవారం సంతోష్ శోభన్ నటించిన పేపర్ బాయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరికొన్ని గంటల్లోనే పేపర్ బాయ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఈ గురువారం విడుదలైన నాగ శౌర్య @నర్తనశాల సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. అంటే @నాగ శౌర్య నర్తనశాల కు ప్లాప్ టాక్ వచ్చినట్లే. ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ను మెప్పించలేకపోయింది.

@నర్తనశాల సినిమాలో దర్శకుడి పనితీరు ఆకట్టుకున్నప్పటికీ… కొన్నిచోట్ల దర్శకుడు చేసిన పొరపాట్లు ప్రేక్షకుడు కి బాగా బోర్ కొట్టించాయి. ఇంట్రెస్టింగ్ లేని స్క్రీన్ ప్లే, కామెడీ లేకపోవడం.. ఉన్న కామెడీ కూడా బోర్ కొట్టిస్తూ గందరగోళంగా ఉండడం… మ్యూజిక్ లో పస లేకపోవడం… ఏదో అలా అలా సాగిన ఫస్ట్ హాఫ్. ఇక నెమ్మదిగా సాగె కథనంతో కొంత సాధారణ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టె సెకండ్ హాఫ్…. ఇవన్నీ @నర్తనశాల కు మైనస్ గా నిలిచాయి. ఇక కొన్ని సన్నివేశాలు అసహజంగా అనిపించడంతో అవి ఎందుకు పెట్టారా అనిపిస్తుంది. కెమెరా మాన్ విజయ్ సి కుమార్ కెమెరా పనితనం బాగుంది, సినిమాలో ఎడిటింగ్ బాగున్నా….. మరింత శ్రద్ధ పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ చలో వంటి హిట్ సాంగ్స్ ఇవ్వలేకపోయాడు.

మరి @నర్తనశాల టాక్ విజయ్ గీత గోవిందానికి మరింత కలిసొచ్చేలా కనబడుతుంది. ఇప్పటికే 15 రోజులనుండి మంచి కలెక్షన్స్ తో అదరగొడుతున్న గీత గోవిందం సినిమా ఇప్పుడు @నర్తనశాలకొచ్చిన టాక్ తో మరింతగా రెచ్చిపోయేలా ఉంది. ఇక ఈ రోజు పేపర్ బాయ్ అనే చిన్న సినిమా ప్రేక్షకులముందుకు వచ్చినప్పటికీ.. ఆ సినిమా హిట్ అయినా కూడా ఓ అన్నంతగా ప్రేక్షకుల్లోకి వెళ్లడం అంత సులభం కాదు. మహేష్, ప్రభాస్ వంటి స్టార్లు సపోర్ట్ ఉన్నప్పటికీ.. ఆ సినిమాకి హీరో క్రేజ్ లేకపోవడం, డైరెక్టర్ గా అతనికి అనుభవం లేకపోవడంతో పేపర్ బాయ్ పరిస్థితి కూడా సోసోగానే కనబడుతుంది. మరి ఈ లెక్కన ఈ వారం కూడా విజయ్ దేవరకొండ చెలరేగిపోవడం ఖాయంగానే కనబడుతుంది. ఇక ఇప్పటికే 100 కోట్ల క్లబ్బులో సంచలనాలు నమోదు చేస్తున్న విజయ్ కి ఈ నర్తనశాల టాక్ మాత్రం బాగా కలిసొస్తుందని చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*