విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి ఆ అమ్మాయితోనేనా?

దిమ్మ‌తిరిగే రేంజ్‌లో క్రేజ్ సంపాదించిన యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. యువ‌తరం ఆయ‌న్ని ఓ ఇప్పుడు త‌మ ఐకాన్‌గా, ఒక స్టార్ హీరోగా చూస్తోంది. అమ్మాయిల్లోనూ అదే స్థాయి క్రేజ్ ఉంది. ఒకొక్క సినిమాకీ త‌న పాపులారిటీని రెండింత‌లు పెంచుకుంటున్న విజ‌య్ ఇప్పుడు ఎంతోమందికి క‌ల‌ల రాకుమారుడు. అయితే అత‌ని గురించి క‌ల‌లుకంటున్న అమ్మాయికి మింగుడుప‌డ‌ని విష‌యం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఆ విష‌యాన్ని స్వ‌యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే బ‌య‌ట‌పెట్టాడు. “నా జీవితంలో ఓ అమ్మాయి ఉంది. నేను నటుడు అవ్వకముందు నుంచీ పరిచయం. అన్ని విషయాల్లోనూ చాలా ప్రోత్సహించింది. మిగిలిన అమ్మాయిల విషయమేమో గానీ తను మాత్రం నాకు దేవత. అమె చుట్టుపక్కల ఉన్నవాళ్లు, స్నేహితులు, తల్లిదండ్రులూ అందరూ నా దృష్టిలో అదృష్టవంతులే“ అంటూ త‌న స్నేహితురాలిని ఆకాశానికెత్తేశాడు.

అది చ‌దివిన‌వాళ్లంతా విజ‌య్ దేవ‌రొకండ సినిమాల్లోకి రాక‌ముందే ల‌వ్‌స్టోరీ మొద‌లుపెట్టాడన్న‌మాట అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవ‌ర‌నేదే ఆస‌క్తిక‌రంగా మారింది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలైతే విజ‌య్ ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడ‌ట అని మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఇది అమ్మాయిల‌కి చేదు విష‌యం కాక‌పోతే మ‌రేంటి? ప్ర‌తి సినిమాలోనూ హీరోయిన్‌తో మంచి కెమిస్ట్రీని పండిస్తుంటాడు విజ‌య్‌. దాంతో ఆయ‌న‌కి అబ్బాయిల‌తో పాటు, అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*