విజయ్ సినిమాకు బాగా డిమాండ్ చేస్తున్నారు!!

‘పెళ్లి చూపులు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో యూత్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక రీసెంట్ గా ‘గీత గోవిందం’ సినిమాతో ఫామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యాడు. ఇలా ఏ సినిమా తీసిన తనకంటూ ఆడియన్స్ ఉంటారు..అతను ఏ సినిమా తీసినా చూసే వారు ఉన్నారు అనుకోటం తప్పే. ప్రస్తుతం విజయ తమిళ, తెలుగు భాషల్లో ‘నోటా’ అనే సినిమా చేస్తున్నాడు.

ట్రైలర్ నుచూస్తే……

ఈసినిమాకి సంబంధించి రీసెంట్ గా ఓ ట్రైలర్ విడుదల అయినా సంగతి తెలిసిందే. ట్రైలర్ బట్టి చూస్తే ఇది చాలా సీరియస్‌ సాగే డ్రామా అనేది అర్ధం అవుతుంది. అంతేకాకుండా ఇందులో తమిళ ఫ్లేవర్ ఎక్కువైనట్టు కనిపించింది. మరి ఇటువంటి సినిమాకి కూడా ‘అర్జున్‌ రెడ్డి’, గీత గోవిందం తరహాలో తెలుగులో భారీ వసూళ్లు వస్తాయి అంటే అది పొరపాటే అవుతుంది.

తెలుగు రైట్స్ కోసం……

ఇది ఇలా ఉంటె ఈసినిమా తెలుగు రైట్స్ కొనాలంటే 25 నుండి 30 కోట్లు వరకు అడుగుతున్నారట తమిళ నిర్మాతలు. అయితే ఈసినిమా దక్కించుకోడానికి పలువురు ఇరవై కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ఇలా ఒకేసారి 30 కోట్లు చెప్పేసరికి ఎవరూ ఈసినిమాను కొనడానికి ముందుకు రావడంలేదట. మరి ఇంత రేటా? ఇది టూమచ్ అంటున్నారు.