మరో క్రేజీ ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్న దేవరకొండ

Vijay Devarakonda arjun reddy

తెలుగులో యంగ్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్స్ లో ఒక్కరు రాజ్ కందుకూరి. ఈయన తీసిన రెండు సినిమాలకి కొత్త డైరెక్టర్స్ ఏ. ‘పెళ్లి చూపులు’ సినిమా తరుణ్ భాస్కర్ తో.. ‘మెంటల్ మదిలో’ సినిమాకు వివేక్ ఆత్రేయతోను ఆయన రూపొందించారు.

ఈ రెండు సినిమాలు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ మెచ్చిన సినిమాలే. అంతేకాకుండా ఈ సినిమాలు యూత్ ని బాగా యాట్ట్రాక్ట్ చేసాయి. కలెక్షన్స్ పరంగా ‘పెళ్లి చూపులు’ పర్లేదు కానీ ‘మెంటల్ మదిలో’ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. కాకపోతే ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరించారు.


అయితే అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలు తీసిన నిర్మాతే మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేసాడు రాజ్ కందుకూరి. రీసెంట్ గా రాజ్ కందుకూరి .. వివేక్ ఆత్రేయ కలిసి, విజయ్ దేవరకొండకి ఒక కథను వినిపించారట. కాన్సెప్ట్ కొత్తగా ఉండటం వలన విజయ్ దేవరకొండ వెంటనే అంగీకరించాడని అంటున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*