నాని కూడా అందుకోవడం లేదు.. కానీ విజయ్ కి మాత్రం?

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆకాశంలో కనబడుతున్న విజయ్ దేవరకొండ చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ‘పెళ్లి చూపులు’ తర్వాత చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ సింగల్ నైట్ స్టార్ అయ్యాడు. రీసెంట్ గా ‘గీత గోవిందం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ యూత్ ఐకాన్ గా ఎదిగాడు. ఇప్పుడు గీత గోవిందం సినిమా హిట్ తో విజయ్ క్రేజ్, మార్కెట్ అన్ని మరింతగా పెరిగిపోయాయి.

ప్రస్తుతం విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే ఎప్పటినుండో ఉన్న యంగ్ హీరోస్ కు అసూయ కలగడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం విజయ్ కి మార్కెట్ తో పాటు డిమాండ్ కూడా ఎక్కువైపోయింది. దాంతో దర్శకనిర్మాతలు విజయ్ తో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు. యంగ్ హీరోలలో నాని వరస హిట్స్ తో ఫామ్ లో ఉన్నాడు. కానీ విజయ్ కి నానికి నాలుగైదు సినిమాలకు వచ్చిన ఫెమ్ కాస్తా రెండు సినిమాలకు రావడం మాత్రం విజయ్ కున్న క్రేజ్ కి నిదర్శనం. తనలోని కామెడీ యాంగిల్, రఫ్ నెస్, యాటిట్యూడ్ వంటి వాటితో యువతకి చాలా తక్కువ సమయంలోనే దగ్గరకాగలిగాడు విజయ్. అందుకే క్రేజ్ కూడా చాలా తక్కువ టైం లో కొట్టేసాడు.

మరి తనకి డిమాండ్ కూడా భారీగా పెరగడంతో విజయ్ కూడా రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశాడు. ఎవరు ఊహించని విధంగా విజయ్ ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ విజయ్ అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతులు రెడీగా ఉన్నారట. హీరో నాని కూడా ఇంత తీసుకుపోవడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*