టాక్సీవాలా మొదటిరోజు వసూళ్లు

Taxiwala 7 days collections

విజయ్ దేవరకొండ – ప్రియాంక జవల్కర్ జంటగా కొత్త దర్శకుడు రాహుల్ దర్శకత్వంలో జర్నలిస్ట్ ఎస్.కే.ఎన్ నిర్మించిన టాక్సీవాలా చిత్రం నిన్న శనివారం విడుదలై పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ నుండి మంచి మార్కులేయించుకుంది. కొత్త నిర్మాతగా ఎస్.కే.ఎన్ కథను నమ్మి ఈ సినిమాని నిర్మించాడు. అలాగే దర్శకుడు రాహుల్ కూడా మంచి థ్రిల్లర్ కథకు కామెడీ టచ్ ఇచ్చాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అవడం.. నేపధ్య సంగీతం కూడా కథకు కరెక్ట్ గా సెట్ అవడంతో సినిమాకి హిట్ టాక్ లేచింది. మరి విడుదలైన మొదటిరోజుకే విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ సినిమా కథకున్న పవర్ తో టాక్సీవాలా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చేసింది. అలాగే రవితేజ అమర్ అక్బర్ ఆంటోని నెగెటివ్ టాక్ కూడా టాక్సీవాలా పాలిట వరంగా మారింది. ఇకపోతే టాక్సీవాలా మొదటిరోజు రెండు రాష్ట్రాల వసూళ్లు మీకోసం.

ఏరియా: మొదటి రోజు కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం 1.40
సీడెడ్ 0.36
అర్బన్ ఏరియాస్ 0.37
గుంటూరు 0.26
ఈస్ట్ గోదావరి 0.21
వెస్ట్ గోదావరి 0.17
కృష్ణ 0.23
నెల్లూరు 0.11

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 3.11 కోట్లు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*