విజయ్ కు మరో షాక్

‘గీత గోవిందం’ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ కు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం టాలీవుడ్ లో లీకులు బెడద ఎక్కువైపోయింది. ‘గీత గోవిందం’ కు ముందే కొన్ని సీన్స్ బయటికి రావడం వారి ని గుంటూరులో అరెస్ట్ చేయటం జరిగింది. అయితే ఆ లీకైన సీన్స్ సినిమాపై ఎటువంటి ప్రభావం చూపలేదు. సినిమా టాలీవుడ్ లో వండర్ క్రియేట్ చేస్తుంది.

అయితే లీకులు నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న విజయ్ కు మరో షాక్ ఏటంటే.. అతను నటించిన ‘ట్యాక్సీవాలా’ ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ ను కొందరు దుండగులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం చివరి దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వనుంది. ఈలోపల ఇలా జరగడం యూనిట్ మొత్తాన్ని షాక్ కి గురిచేసింది.

ఈ నేపథ్యంలో ‘ట్యాక్సీవాలా’ లీక్ కావడంతో నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సినిమా గూగుల్ డ్రైవ్ నుంచి లీక్ అవుతున్నట్లు గుర్తించారు. రెల్ల కమల్, భార్గవ్ కుమార్, బీఆర్ పేర్లతో ఉన్న జీ-మెయిల్ అకౌంట్ల ద్వారా ఇది షేర్ అవుతుందని వారు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు వారిని పట్టుకునే పనిలో ఉన్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1