విజయ్ ఆనందం అతని ట్వీట్ లోనే…!

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల‌తో స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ గీత గోవిందం సక్సెస్ ని విదేశాల్లో కూర్చుని మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందానికి రెండు వారాలుగా ఎదురనేదే లేకుండా పోవడంతో… అదరగొట్టే కలెక్షన్స్ తో దుమ్ము రేపుతున్నాడు. విజయ్ దేవరకొండ గీత గోవిందం విడుదలయ్యాక రెండు వారాల నుండి సరైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాక విజయ్ కి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన విజయ్ కెరీర్ లో మొదటిసారి ఈ క్లబ్బుని అందుకున్నాడు. ఇక తాజాగా గత వారం విడుదలైన నర్తనశాల, పేపర్ బాయ్ కూడా ప్రేక్షకుల ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవడంతో.. గీత గోవిందానికి మరో వారం అదనంగా కలిసొచ్చింది. ఇక 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిన విజయ్ ఆనందాన్ని ఒక ట్వీట్ తో చెప్పేసాడు. తన సినిమా ఈ రేంజ్ హిట్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్న విజయ్ దేవరకొండ…. గీతా అర్స్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్నానని ట్వీట్ చేసాడు.

ఈ చిత్రం వారికి అంకితం

విజయ్ దేవ‌ర‌కొండ ట్వీట్ లో… నా తొలి సెంచరీని నా కోచింగ్ స్టాఫ్ గీతా ఆర్ట్స్ కి .. కెప్టెన్ బుజ్జికి .. నా పార్ట్నర్ హీరోయిన్ రష్మిక మందన్నకి అంకితం ఇస్తున్నాను. అలాగే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకుల ఆదరణ అమేజింగ్ గా ఉంది. అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది… అంటూ గీతా ఆర్ట్స్ బ్యానర్ కి హీరోయిన్ రశ్మికకి, డైరెక్టర్ పరశురామ్ కి కూడా థాంక్స్ చెప్పాడు విజయ్ దేవరకొండ. నోటా, టాక్సీవాలా సినిమాల‌తో ఈ ఏడాది మ‌ళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*