విజయ్ ని రిజెక్ట్ చేసిన హీరోయిన్స్..!

హీరో విజయ్ దేవరకొండ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా తన సినిమా ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ సినిమాతో విజయ్ దాదాపు స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఒక్క సినిమాకే ఇంత పేరు రావడం అంటే మామూలు విషయం కాదు. మరి అటువంటి హీరోతో ఏ దర్శక నిర్మాతలకు సినిమా చేయాలనీ ఉండదు చెప్పండి. అలానే హీరోయిన్స్ కూడా మనోడితో చేయడానికి అవకాశం వస్తే ఎవరు కాదంటారు..

20 మంది కూడా వద్దన్నారు…

కానీ ‘అర్జున్ రెడ్డి’ కంటే ముందు విజయ్ కమిటైన ‘గీత గోవిందం’కు మాత్రం హీరోయిన్ విషయంలో చాలా ఇబ్బంది ఎదురైందట. హీరోయిన్ దొరకక తొమ్మిది నెలల పాటు ఈ సినిమాను మొదలుపెట్టకుండా ఆగాల్సి వచ్చిందని దర్శకుడు పరశురామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టాలీవుడే కాకుండా వేరే భాషలకు చెందిన 20 మంది దాకా హీరోయిన్స్ ను సంప్రదించానని అందరూ నో చెప్పారని చెప్పారు.

చివరకు రష్మిక దొరికింది

‘అర్జున్ రెడ్డి’ కంటే ముందు విజయ్ కు అంతగా పేరు ఇమేజ్ లేకపోవడంతో ఆయనతో సినిమా చేయడానికి ఏ హీరోయిన్ ముందుకు రాలేదని.. చివరకు రష్మిక ఓకే అయిందని.. కాకపోతే ఆమె డేట్స్ కుదరక మూడు నెలలు ఆమె కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని.. ఆమెను చూసాకా..ఆమెకు స్టోరీ చెప్పాకా..గీత పాత్రకు ఆమె కరెక్ట్ అని అనిపించిందని పరశురామ్ చెప్పాడు. ఈ సినిమాలో ఇద్దరి పాత్రలు ఈక్వల్ గా ఉంటుందని…ఇద్దరి మధ్య కెమిస్ట్రీనే సినిమాకు ప్రధాన ఆకర్షణ అని..సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*