విజయ్ తో ఆ డైరెక్టర్ సినిమా…?

Vijay Devarakonda in Forbes list

రెండే రెండు సినిమాలు విజయ్ దేవకొండని స్టార్ హీరోల సరసన చేర్చేసాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాల మీద పిచ్చ ఆసక్తి ట్రేడ్, ప్రేక్షకుల్లో నెలకొంది. విజయ్ నోటా, టాక్సీవాలా సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా విజయ్ చేతిలో డియర్ కామ్రేడ్ సినిమా ఉంది. అయితే విజయ్ దేవరకొండతో సినిమాలు చెయ్యాలని టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ గట్టి ప్రయత్నాలే ప్రారంభించేసారు. అందులో పూరి జగన్నాధ్, మారుతీ ఉన్నారనే టాక్ టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది

10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడా..?

అయితే పూరితో సినిమా లేదని విజయ్ దేవరకొండ తేల్చేసాడు. కానీ ఇప్పుడు భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజ రెడ్డి అల్లుడు ఫేమ్ మారుతీతో విజయ్ దేవరకొండ సినిమా ఉండబోతుంది అంటూ ఫిలింసర్కిల్స్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే దర్శకనిర్మాతలు విజయ్ తో సినిమాలు చేసేందుకు అడ్వాన్సులు ఇవ్వడానికి రెడీ అయ్యి మరీ విజయ్ దేవరకొండ ఇంటిముందు క్యూ కట్టారట. డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని విజయ్ కూడా 10 కోట్లు రెమ్యునరేషన్ అడుగుతున్నాడనే టాక్ అందిస్తుంది.

ప్రస్తుతం ఫుల్ బిజీగా విజయ్…

యూవీ క్రియేష‌న్స్‌ లో ఒక సినిమా చేయ‌డానికి విజ‌య్ ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే అదే యువీ సంస్థ‌తో మారుతి కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. అందుకే ఈ మారుతికి, విజయ్ దేవరకొండకి జోడీ కుదిరింద‌ని టాక్‌. ప్ర‌స్తుతం శైల‌జారెడ్డి అల్లుడు విడుదల, ప్రమోషన్స్ తో బాగా బిజీగా ఉన్నాడు మారుతి. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో మారుతి సినిమా ఉందా అనేది ప్రస్తుతం అయితే డౌట్. ఎందుకంటే విజయ్ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఆ ప్రాజెక్టులు అయ్యేవరకు మారుతి వేచి చూడాలి. ఈ లోపు మరో హీరోతో మారుతి ఒక సినిమా చేస్తాడో.. లేదంటే 2019 ద్వితియార్ధం వరకు విజయ్ కోసం వెయిట్ చేస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*