డీసెంట్ అర్జున్ రెడ్డి..!

విజయ దేవరకొండ కి అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ బ్రేక్. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఇంతవరకు ఒక్క సినిమా వచ్చింది లేదు. కెరీర్ స్టార్టింగ్ లో నటించిన ఒక మూవీ విడుదలైనా అది చడీ చప్పుడు చెయ్యలేదు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ నుండి వరసబెట్టి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే టాక్సీవాలా ఎప్పుడెప్పుడు దిగుదామా అన్న రేంజ్ లో అన్నీ పూర్తి చేసుకుని కూర్చుంది. ఈ లోపు నేను రెడీ అంటూ గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన గీత గోవిందం ఆగష్టు 15 న రావడానికి ఫిక్స్ చేసేసుకుంది. తాజాగా ప్రమోషన్స్ లోకి దిగిన విజయ్ దేవరకొండ ఈ సినిమా ని డిఫ్రెంట్ గా ప్రమోట్ చేస్తున్నాడు.

ఆస్తకికరంగా పోస్టర్…

అర్జున్ రెడ్డి సినిమాలో… ఎవ్వరినీ లెక్కచెయ్యని స్టూడెంట్ గా… ప్రేమలో ఓడిపోయి.. ప్రియురాలు మరో పెళ్లి చేసుకుందన్న కసితో.. మద్యానికి బానిసై… కుటుంబ సభ్యులకు దూరమై.. కనబడిన అమ్మాయిలతో తిరుగుతూ… డాక్టర్ వృత్తిలో కూడా ఇమడలేక సస్పెండ్ అయ్యి… చివరికి తనని తాను తెలుసుకుని కుటుంబంతో పాటుగా.. ప్రియురాలిని పెళ్లాడిన రఫ్ క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ నటనని యూత్ ఇప్పటికి మరిచిపోలేదు. అయితే గీత గోవిందం లో మాత్రం హీరోయిన్ రష్మిక మందన్నాకి తానిప్పటికీ స్టిల్ వర్జిన్ అంటూ చెబుతున్నాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం పోస్టర్ లో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక వైపు ఓర కంటితో చూస్తూ… మీరు ఏమైనా అనుకోండి.. నా అఫీసియల్‌ స్టేటస్‌ మాత్రం ఇదే మేడమ్‌ అంటూ ఆ పోస్టర్ కింద రాసాడు. అయితే రష్మిక చూస్తున్న చూపు చూస్తుంటే మాత్రం విజయ్ డీసెంట్ బాయ్ ల నటించే ఖతర్నాక్ లా అనిపిస్తున్నాడు. ఇక రష్మికని పోస్టర్ లో సగం మాత్రమే చూపించారు. ఇక ఆ పోస్టర్ వెనకవైపుగా ఐ యామ్‌ 25.. స్టిల్‌ వర్జిన్‌ మేడమ్‌ అని రాసారు.

చేతి నిండా సినిమాలు

మరోసారి విజయ దేవరకొండ డీసెంట్ అర్జున్ రెడ్డి అవతారం ఎత్తబోతున్నాడా అనే అనుమానం ఆ పోస్టర్ తో పాటు రాసిన ఆ డైలాగ్స్ చూస్తుంటే అనిపిస్తుంది. చూద్దాం డీసెంట్ అర్జున్ రెడ్డి రాష్ అర్జున్ రెడ్డిని ఎలా క్రాస్ చేస్తాడో అనేది. ఇక పొతే ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం రోజు అంటే ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తమిళంలో విజయ్ నటిస్తున్న నోటా కూడా షూటింగ్ పూర్తి చేసుకోవచ్చింది. తాజాగా డియర్ కామ్రేడ్ అంటూ మరో మూవీ ని మొదలెట్టేసాడు విజయ దేవరకొండ.