స్టూడెంట్.. డాక్టర్… స్టూడెంట్ లీడర్.. ఇప్పుడు టెక్కీ..?

పెళ్లిచూపులు సినిమాలో బాధ్యత లేని కుర్రాడిలా నటించి మెప్పించిన విజయ్ దేవరకొండ…. అర్జున్ రెడ్డి సినిమాలో స్టూడెంట్ గా అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. బెస్ట్ స్టూడెంట్ గా అమ్మాయిని లవ్ చేసి.. డాక్టర్ గా మారి.. ప్రేమించిన పిల్ల కోసం తపన పడే ప్రేమికుడిలా.. అదరగొట్టేసాడు. అప్పటినుండి విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ అన్నట్టుగా తయారైంది వ్యవహారం. ఇక ఆ సినిమా తర్వాత టాక్సీవాలా సినిమా చేసిన విజయ్ దేవరకొండ.. ఆ సినిమా విడుదలవక ముందే… రష్మిక మందన్నతో కలిసి గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సినిమాలపై సినిమాలు…

ఇక గీత గోవిందంలో గోవింద్ గా జూనియర్ లెక్చరర్ గా విజయ్ దేవరకొండ స్టయిలిష్ నటన ఆకట్టుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అదరగొట్టే పెరఫార్మెన్స్ ఇచ్చాడు. మరి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక డియర్ కామ్రేడ్ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్న విజయ్ దేవరకొండ.. సినిమాల మీద సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో నోటా సినిమా పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతుండగా… డియర్ కామ్రేడ్ స్టూడెంట్స్ పాలిటిక్స్ నేపథ్యంలోనే ఉండబోతుంది. ఆ రెండు సినిమాల తర్వాత క్రాంతి మాధవ్ దర్శకుడిగా విజయ్ దేవరకొండ నటించబోయే చిత్రం త్వరలోనే మొదలు కాబోతుంది.

ఇప్పడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా…

అయితే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ నటించబోయే ఆ సినిమా లో విజయ్ దేవరకొండ సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టబోతున్న ఈ సినిమాలో టెక్కీగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడని.. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో విజయ్ స్టూడెంట్ గా, లెక్చరర్ గా అదరగొట్టేస్తే ఇప్పుడు సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా ఎలాంటి పెరఫార్మెన్సు ఇవ్వబోతున్నాడా అంటూ హాట్ హాట్ చర్చలకు తెరలేపారు విజయ్ అభిమానులు. ఇక ఈ సినిమాలో గీత గోవిందంలో విజయ్ సరసన అవకాశం పోగుట్టుకుని.. శ్రీనివాస కళ్యాణం సినిమాతో కాస్త ఢీలా పడిన రాశి ఖన్నా నటించనున్నట్లుగా చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*