ఈస్ట్ గోదావరి పిల్లోడిగా విజయ్..!

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’ ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఈ సినిమాలో పూర్తి డిఫరెంట్ పాత్రలో నటించాడు విజయ్. ఈ సినిమాతో క్లాస్ మరియు ఫామిలీ ప్రేక్షకులకి దగ్గర కానున్నాడు విజయ్. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసేసాడు.

స్టూడెంట్ లీడర్ గా విజయ్

తన మొదటి సినిమాను డైరెక్ట్ చేస్తున్న భరత్ కమ్మా డైరెక్షన్ విజయ్ తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘డియర్ కామ్రేడ్’ అనే టైటిల్ పెట్టారు. ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని.. ఇందులో విజయ్ కాకినాడలోని ఒక కాలేజ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడని టాక్. స్టూడెంట్ లీడర్ గా విజయ్ నటిస్తుండగా.. క్రికెటర్ గా రష్మిక మందన్నా కనిపించనుంది.

మొత్తం తూర్పుగోదావరిలోనే..

దాదాపు ఈ సినిమా షూటింగ్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోనే జరగనుంది. ప్రస్తుతం షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లాలోని ‘తొండంగి’లో జరుగుతోంది. విజయ్ తో పాటు కొన్ని ప్రధానమైన పాత్రలపై చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ భరత్. ఇప్పుడు వరకు తెలంగాణ యాసతో యూత్ ను ఆకట్టుకున్న విజయ్.. ఈ సినిమాతో ఈస్ట్ గోదావరి యాసతో అదర కొట్టనున్నాడు.