విజయ్ పక్క ప్లాన్ తో వస్తున్నాడుగా..

‘గీత గోవిందం’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అప్పుడే తన కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయింది. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నోటా’ అనే సినిమా ప్రొమోషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు మేకర్స్. దానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

సీఎం పాత్రలో విజయ్..?

రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవ్వనుంది. విజయ్ కి జోడిగా మెహ్రీన్ కనిపించనుంది. నిజానికి ‘టాక్సీవాలా’ వస్తుంది అనుకుంటే ట్విస్ట్ ఇస్తూ ‘నోటా’ను ముందుకు తెస్తున్నారు. విజయ్ ‘నోటా’లో సీఎం పాత్రలో నటించనున్నాడని చెన్నై మీడియా టాక్. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘సర్కార్’ చిత్రం కూడా ఇలానే ఉంటుందని గాసిప్ బలంగా వినిపిస్తోంది. అందుకే ‘నోటా’ సినిమాను ముందుకు జరపాలని మేకర్స్ తో పాటు విజయ్ కూడా భావిస్తున్నాడట.

టాక్సీవాలాను పక్కనపెట్టి మరీ…

‘గీత గోవిందం’తో వచ్చిన పాపులారిటీని చెడకొట్టుకోవడం దేనికి అని ‘టాక్సీవాలా’ని పక్కన పెట్టేసి ‘నోటా’ని ముందుకు తీసుకురావడానికి మరో కారణం. అల్లు అరవింద్ కూడా ‘నోటా’కే సై అని చెప్పినట్టు సమాచారం. దీంతో సడన్ గా విజయ్ ‘నోటా’ సినిమాను తెర మీదకు తీసుకొచ్చాడు. అనుకున్నట్టుగానే ఈ సినిమా కూడా హిట్ అయితే విజయ్ ని పట్టుకోవడం కష్టమే. మరోవైపు ‘టాక్సీవాలా’ను నేరుగా డిజిటల్ ఫార్మాట్ లో విడుదల చేసేలా ఒప్పించేందుకు విజయ్ దేవరకొండ బాగా కష్టపడుతున్నాడట. ‘నోటా’ తర్వాత ఫిబ్రవరిలో ‘డియర్ కామ్రేడ్’ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి విజయ్ తన సినిమాల రిలీజ్ విషయంలో చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నాడు. మరి ‘నోటా’ ఎలా ఉండబోతుందో సెప్టెంబర్ 6న విడుదల అయ్యే ట్రైలర్ లో చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*